టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్‌ల క్రేజీ మల్టీస్టారర్ చిత్రం సెట్స్ పైకి వెళ్లకముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) భారీ ధరకు డిజిటల్ హక్కులను దక్కించుకోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సినిమా సగం పూర్తయ్యాక లేదా విడుదల సమయంలో జరిగే ఇలాంటి డీల్స్, కేవలం ప్రకటన దశలోనే ముగిసిపోవడం అనిల్ రావిపూడిపై మార్కెట్‌లో ఉన్న నమ్మకానికి నిదర్శనం.
ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో తీసిన 9 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి, నిర్మాతలకు లాభాల పంట పండించాయి. అందుకే ఆయనను ఇండస్ట్రీలో ‘ప్రొడ్యూసర్స్ డైరెక్టర్’ అని పిలుస్తారు. 2026 జూన్ చివరి వారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ షూటింగ్‌ను కేవలం మూడు షెడ్యూల్స్‌లోనే పూర్తి చేయాలని చిత్రబృందం పక్కా ప్లానింగ్‌తో ఉంది. ముఖ్యంగా వెంకటేష్‌తో అనిల్‌కు ఇది 5వ సినిమా కాగా, గత 4 చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.
అలాగే కళ్యాణ్ రామ్‌తో కూడా ఆయనకు గతంలో మంచి సక్సెస్ ఉంది. ఈ మల్టీస్టారర్ మూవీని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండుగ సీజన్లలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించడంలో అనిల్ రావిపూడి దిట్ట కావడంతో, ఈ చిత్రం కూడా రికార్డు వ్యూస్ సాధిస్తుందని డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ముందే పోటీ పడుతున్నాయి. తక్కువ బడ్జెట్, తక్కువ టైమ్, కానీ భారీ సక్సెస్.. ఇదే అనిల్ రావిపూడి ఫార్ములా, ఇది ఇప్పుడు ఈ కొత్త సినిమా విషయంలో మరోసారి నిరూపితమైంది.