టాలీవుడ్ లో ప్రియదర్శి అంత బిజీ గా ఎవరు ఉండరేమో… మరి అన్ని సినిమాలు చేస్తున్నాడు! లేటెస్ట్ గా ఈ మంత్ ‘ప్రేమంటే’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అందుకే రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో ట్రైలర్ రిలీజ్ చేసారు నిర్మాతలు ఇందాకే…
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తీసిన ఈ రొమాంటిక్ అండ్ కామెడీ డ్రామాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా, సుమ కనకాల, వెన్నెల కిశోర్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీజర్ స్టార్టింగ్ లో అబ్బా మంచి పెళ్లి చూపుల సీన్ చూపించి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఎక్సపెక్టషన్స్ ఎలా ఉంటాయో చూపించి, పెళ్లి కూడా అలా అలా చూపించారు… కానీ పెళ్లి చూపుల్లో ఉన్నంత మజా పెళ్లి అయినా కొన్ని రోజుల తరవాత ఉండదు కదా…
అలా కొత్త పెళ్లి చూపుల అనుభవాలు ఎంత క్యూట్ గా మొదలై, చివరకు ఎంత చిన్న చిన్న గొడవలతో సాగుతాయో ఒక అద్భుతమైన ఫీల్ తో చూపించారు. ప్రేమలో మొదలు పెట్టిన కథ, పెళ్లి తర్వాతా కూడా అంతే కలల ప్రపంచం గా ఉంటుందనుకునే మనసులు… కానీ లైఫ్ రిలయలిటీస్ ఎలా చిట్టచివరకు ఆ ఇద్దరి మధ్య నవ్వులు,చిన్న చిన్న ఈగో ఫైట్లు తెచ్చాయో చాలా రియలిస్టిక్ గా చూపించారు.
ప్రియదర్శి – ఆనంది జంట చాలా నేచురల్ గా ఉంది. ముఖ్యంగా వారి కెమిస్ట్రీ, డైలాగ్స్, సిచువేషనల్ కామెడీ – ఈ జనరేషన్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. సుమ చిన్ని సీన్ కూడా సినిమాకి వేరే లెవెల్ లో ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంది.
ప్రేమ, పెళ్లి, గొడవలు, ఇలా చిన్న చిన్న లైఫ్ రియలైజేషన్స్ – ఇవన్నీ కలిపి ‘ప్రేమంటే’ టీజర్ చాలా బాగా వచ్చేలా చేసింది. ఈ నవంబర్ 21న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీపై ఇప్పుడు మంచి అంచనాలు మొదలయ్యాయి!