చేదుగా ఉంటుందనే ఒక్క కారణంతో చాలా మంది మునగాకును తమ ఆహారంలోకి రానివ్వరు. కానీ అదే మునగాకు… వారానికి రెండుసార్లు సూప్‌గా తాగితే శరీరంలో వచ్చే మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. మన పెద్దలు “మునగాకు అమృతం” అని ఎందుకు అన్నారో అప్పుడు అర్థమవుతుంది. ఇది కేవలం ఆకుకూర కాదు… సహజంగా శరీరాన్ని రీచార్జ్ చేసే నేచురల్ టానిక్.
ఈరోజుల్లో ఉదయాన్నే అలసటగా ఉండటం, చిన్నపాటి జీర్ణ సమస్యలు, తరచూ జలుబు రావడం, ఇమ్యూనిటీ తగ్గినట్టు అనిపించడం చాలా సాధారణమైపోయాయి. ఇలాంటి సమస్యలకు మందుల కంటే ముందుగా ప్రయత్నించాల్సింది మన వంటింటి చిట్కాలే. అందులో మునగాకు సూప్ ఒకటి. మునగాకులో విటమిన్ A, విటమిన్ C, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడంలో, శరీరానికి శక్తిని అందించడంలో కీలకంగా పనిచేస్తాయి.

మునగాకు సూప్ తయారీ కూడా చాలా సులువు. ముందుగా శుభ్రంగా కడిగిన మునగాకును నీటిలో మరిగించాలి. పక్కనే కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలను దోరగా వేయాలి. అందులో మరిగిన మునగాకు, అవసరమైనంత ఉప్పు, చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి మరో రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. మొదట చేదుగా అనిపించినా… క్రమంగా ఆ రుచి అలవాటైపోతుంది.
వారంలో రెండు సార్లు ఈ సూప్ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉదయం లేచినప్పటి అలసట తగ్గి రోజంతా యాక్టివ్‌గా ఉండే ఫీల్ వస్తుంది. ఇమ్యూనిటీ బలపడడంతో చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా మారుతున్న జీవనశైలిలో, ఫాస్ట్ ఫుడ్‌కు అలవాటుపడ్డ వారికి మునగాకు సూప్ ఒక మంచి బ్యాలెన్స్ లాంటిది.
చేదు రుచి చూసి దూరం పెట్టే ముందు… ఒకసారి అలవాటు చేసుకోండి. ఆరోగ్యం మెరుగుపడితే అదే మీకు పెద్ద రివార్డ్.