అయోధ్యలో ఎటు చూసినా ఇప్పుడు పండుగ వాతావరణం కనిపిస్తోంది. రంగు రంగుల పూలతో అయోధ్య మొత్తం అలంకరిస్తున్నారు. ఈనెల 25న వివాహ పంచమి కావడం, సీతారాముల వివాహ వార్షికోత్సవం కావడంతో ఆ రోజున అయోధ్యలో సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు, వివాహ పంచమి రోజున అయోధ్య ఆలయంలో మిగతా ఉపాలయాలను ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు లక్షలాదిమంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పటికే నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2019లో అయోధ్య రామాలయం తీర్పు తరువాత ఆలయం పనులు ప్రారంభమయ్యాయి. 2024 జనవరిలో రామాలయం ప్రారంభం కాగా, 2025 నవంబర్ 25న మిగిలిన ఉపాలయాలను ప్రారంభించనున్నారు.
Related Posts
SIIMA లో సినీ తరాల సందడి…
Post Views: 0
Post Views: 0
ఆధార్ లేకుంటే ట్రైన్ టికెట్ దొరకదు
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణించే వాటిల్లో ట్రైన్ ఒకటి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు వివిధ క్లాసుల్లో…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణించే వాటిల్లో ట్రైన్ ఒకటి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. సాధారణ ప్రజల నుంచి ధనవంతుల వరకు వివిధ క్లాసుల్లో…