పైడితల్లి అమ్మవారి సేవలో గోవా గవర్నర్‌

Goa Governor Ashok Gajapathi Raju Offers Devotional Service to Paidithalli Ammavaru
Spread the love

ఉత్త‌రాంధ్ర క‌ల్ప‌వ‌ల్లి,విజ‌య‌న‌గ‌రం ఆడ‌ప‌డుచు శ్రీశ్రీ శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారిని గోవా రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్‌, ఆల‌య అనువంశిక ధ‌ర్మ‌క‌ర్త పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు సోమ‌వారం సంద‌ర్శించుకున్నారు. గ‌వ‌ర్న‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన అశోక్‌గ‌జ‌ప‌తి, అమ్మ‌వారిని స‌తీస‌మేతంగా ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆయ‌నకు ఆల‌య అధికారులు అధికార లాంఛ‌నాల‌తో స్వాగ‌తం ప‌లికారు. పూజారులు ప్ర‌త్యేక ఆశీర్వ‌చం ప‌లికి, అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి దేవ‌స్థానం స‌హాయ క‌మిష‌న‌ర్ శిరీష‌, సూప‌రింటిండెంట్ వైవి ర‌మ‌ణి, ఇత‌ర అధికారులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *