Pawan Kalyan Responds to Distressed Woman in Muscat, Orders Immediate Rescue EffortsPawan Kalyan Responds to Distressed Woman in Muscat, Orders Immediate Rescue Efforts
“ప్రతీ సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం, నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు, మన బాధను మనలోనే దాచుకొని, “కర్మ చూసుకుంటుంది” అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము.
ఈ విధానం ఖచ్చితంగా మారాలి.
కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా, మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు, మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత.
అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా, మన ధర్మ పరిరక్షకులుగా మారాలి.
హిందూ ధర్మాన్ని కాపాడటం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదు.
కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే.”