శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు: నటుడు ప్రకాష్ రాజ్‌పై వనస్థలిపురంలో పోలీస్ కేసు!

Prakash Raj complaint Hyderabad

హైద‌రాబాద్ వ‌నస్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ లో సినీ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ పై వ‌న‌స్థ‌లిపురం శ్రీభ్ర‌మ‌రాంబిక మ‌ల్లికార్జున స్వామి దేవ‌స్థానం క‌మిటీ చైర్మ‌న్‌ ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌,హైద‌రాబాద్‌ బార్ కౌన్స‌ల్ మెంబ‌ర్ ఎం.వీ.మ‌ణిశేఖ‌ర్ ఫిర్యాదు చేసారు. ఆల‌య క‌మిటీ అధ్య‌క్ష‌,కార్య‌ద‌ర్శులైన అంజ‌య్య‌,పురుషోత్తం,వెంక‌టేష్‌,సేన‌య్య లు సీఐకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. శ్రీరాముని జీవితం ప్ర‌పంచ జ‌నావ‌ళికే ఆద‌ర్శం,రాముడు ఆద‌ర్శ ప్రాయుడ‌ని అలాంటి రామునిపై అనుచిత వ్యాఖ్య‌లు ప్ర‌కాష్ రాజ్ చేయ‌డం ఎంత మాత్రం త‌గ‌ద‌న్నారు. ప్ర‌కాష్ రాజ్ ఒక క్రైస్త‌వుడ‌ని, దేశాన్ని,హిందూ దేవ‌త‌ల‌ను విమ‌ర్శించ‌డం ఆరోపించ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి అయ్యింద‌ని ఆల‌య కమిటీ చైర్మ‌న్ మ‌ణి శేఖ‌ర్ అన్నారు.

హిందూ దేవ‌త‌ల‌ను దూషించ‌డం ప్ర‌తీ ఒక్క‌రికి అల‌వాటైంద‌ని ఆలా ఆరోపించ‌న వాళ్లంద‌రూ అన్య‌మ‌త‌స్థులేన‌ని అన్నారు.నిత్యందైవ ఆరాధాన‌,పురాత‌న చారిత్ర‌క ప్రాశ‌స్యం క‌లిగి దేవదేవ‌త‌లు స‌ర్వ‌మాన వాళికి స్పూర్తి దాయ‌క‌మ‌న్నారు. 1786లో ప్రెంచ్ అస్ట్రోల‌జిస్ట్ నాస్ట్రోడ‌మ్…20వ ద‌శాబ్దం నుంచీ ప్ర‌పంచం అంతా భార‌త్ వైపు చూస్తుందని హిందూ దేశంగా మార‌డానిక అప్పుడే మొద‌లవుతుంద‌ని అప్పుడే చెప్పార‌ని అడ్వ‌కేట్ మ‌ణి శేఖ‌ర్ గుర్తు చేసారు. ప్ర‌స్తుదం పీఎం మోడీ నేతృత్వంలో దేశం యావ‌త్తు అన్ని రంగాల‌లో ముందుకెళుతోంద‌ని ఇదే సంకేత‌మ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *