మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన కన్నుమూశారు. ఈరోజు ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ కావలసి ఉండగా… విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఈ ప్రమాదం జరిగింది. అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు మొత్తం మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. దీని కోసం ఉదయం ఆయన ముంబై నుంచి బయలుదేరి వెళ్లారు. అయితే, బారామతి రన్‌వేపై ల్యాండింగ్ అయ్యేందుకు విమానం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఒక్కసారిగా నేలపై కుప్పకూలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే విమానంలోని వారంతా ప్రాణాలు కోల్పోయారు.
Related Posts
మాదక ద్రవ్యాలపై పార్వతీపురం లో అవగాహన
పార్వతీపురంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధి ఆర్.కే.జూనియర్ కళాశాల విద్యార్దులకు, అధ్యాపకులకు మత్తుపదార్దాల వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ర్యాగింగు,…
పార్వతీపురంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధి ఆర్.కే.జూనియర్ కళాశాల విద్యార్దులకు, అధ్యాపకులకు మత్తుపదార్దాల వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ర్యాగింగు,…
విజయనగరం ఎస్పీ బంగ్లాకు సంక్రాంతి శోభ
గడచిన దశాబ్దాలుగా పాత భవనం రూపంలో ఉన్న విజయనగరం లో ఉన్న ఎస్పీ బంంగ్లాకు కొత్త రూపం వచ్చింది. సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తోంది.ఏళ్ల తరబడి మెరుగులు…
గడచిన దశాబ్దాలుగా పాత భవనం రూపంలో ఉన్న విజయనగరం లో ఉన్న ఎస్పీ బంంగ్లాకు కొత్త రూపం వచ్చింది. సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తోంది.ఏళ్ల తరబడి మెరుగులు…
బాబోయ్… ఇరుక్కపోయాం
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ…
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ…