ఎచ్చెర్లలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకల్లో శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగ బాబు…
భారతదేశం కోసం కుటుంబాన్ని, జీవితాన్ని, ఆఖరికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహానుభావుల త్యాగాలను, భారతదేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలని, రాబోయే తరాల చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయించాలని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులతో జాతీయ జెండా ఆవిష్కరణ చేయించిన అనంతరం శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడారు. “భారత దేశం నా మాతృభూమి., భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను..” అనే ప్రతిజ్ఞ తప్పనిసరిగా చేయించాలని, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిత్యం ప్రతిజ్ఞ చేయిస్తున్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల్లో చాలావరకు ప్రతిజ్ఞ చేయించట్లేదని అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా మనమంతా భారతీయులం అనే భావన ప్రతిజ్ఞలో ఉంటుందని వెల్లడించారు.

దేశ గౌరవాన్ని గుర్తించాలి, దేశంకోసం పనిచేయాలి, దేశాన్ని పరిరక్షించాలి.. అనే భావన విద్యార్థుల్లో పెంపొందించాలన్నారు. పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పాలవలస యశస్వినీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు డాక్టర్ పంచకర్ల సందీప్, జనసేన శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీ గేదెల చైతన్య, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ గర్భాన సత్తిబాబు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ దాసరి రాజు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ దుర్గారావు, జీసీసీ డైరెక్టర్ శ్రీ నిబ్రమ్, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్, ఆముదాలవలస పీఏసీ శ్రీ పెదాడ రామ్మోహన్, టెక్కలి పీఓసీ శ్రీ కణితి కిరణ్, నరసన్నపేట పీఓసీ శ్రీ బలగ ప్రవీణ్, ఏపీ ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం అధ్యక్షులు శ్రీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.