ఫుట్‌బాల్‌ చరిత్రలో అద్భుతం…ఇలాంటి గోల్‌ మీరెప్పుడూ చూసుండరూ

A Miracle in Football History – A Goal Like Never Before

ప్రపంచంలో అత్యధికమంది ఇష్టపడే గేమ్‌ ఫుట్‌బాల్‌. ఈ గేమ్‌కి అత్యంత అధరణ ఉంది. ప్రపంచ కప్‌తో పాటు వివిధ రకాల టోర్నమెంట్లు జరుగుతుంటాయి. ఒక బంతి కోసం రెండు జట్లు పోటీపడి మరీ పరుగులు తీస్తూ గోల్‌ కోసం ప్రయత్నం చేస్తుంటాయి. 22 మంది మధ్యలో ఒక బాల్‌ను తన్నుతూ గోల్‌ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ వినూత్న రీతిలో గోల్‌ చేయాలి అంటే దానికి ఎంతో సాధన అవసరం. అద్భుతంగా గోల్స్‌ చేయగల క్రీఢాకారుల లిస్ట్‌లో మనకు పీలే, రోనాల్డొ, రోనాల్డిన్హో, డియాగో మారడోనా, మెస్సీ, డి మారియా, కాకా వంటి ప్లేయర్స్‌ మనకు కనిపిస్తుంటారు. ఆరోజుల్లో పీలే, డియాగో మారడోనా ఆడిన ఆట నేటికి మనకు గుర్తుండిపోయింది. ఇటీవల కాలంలో మెస్సీ చేసిన గోల్స్‌ వావ్‌ అనిపిస్తుంటాయి. అయితే, వీటిన్నింటిని మించేలా ఒక తరంగం ఆకృతిలో బాల్‌ గాలిలోనే తన దిశను మార్చుకుంటూ వెళ్లి గోల్స్‌ పోస్ట్‌లో పడుతుంది. ఇలా గోల్‌ చేయడం దాదాపుగా అసాధ్యం. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత, గ్రీన్‌మ్యాట్‌ సంస్కృతి ప్రపంచాన్ని ఏలుతున్న సమయంలో ఏదైనా సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఇది జస్ట్‌ ఫన్‌ కోసమే క్రియేట్‌ చేసిందే. అయినప్పటికీ చూసేవారిని నిజంగానే ఇలా కూడా గోల్‌ చేయవచ్చా అని ఆలోచించే విధంగా చేస్తుంది ఈ వీడియో. ట్విట్టర్‌లో పోస్ట్‌ అయిన ఈ వీడియో క్రీఢాభిమానులను అలరిస్తోంది. మీరుకూడా ఓ లుక్‌ వేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *