వినాయక చవితి నవరాత్రులు ముగిశాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో గణనాథులను పూజించిన భక్తులు, ఆ తరువాత ఆ విగ్రహాలను గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే, ఈ నిమజ్జన వేడుకలు ఒక్కోచోట ఒక్కోవిధంగా జరిగాయి. భారీ క్రేన్లతో కొన్ని చోట్ల సరస్సుల్లో, నదుల్లో, సముద్రాల్లో నిమజ్జనం చేస్తే రాజమహేంద్రవరంలోని గోదావరిలో విగ్రహాల నిమజ్జనం అందర్నీ ఆకట్టుకునేవిధంగా జరిగింది. విగ్రహాలను నదిలో విసిరేయకుండా, వాటిని పడవలో పెట్టుకొని నది మధ్యలోకి తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేశారు. భక్తిశ్రద్ధలతో పూజించిన వాటిని క్రేన్ల సహాయంలో విసిరేయడం, కాలితో తొక్కడం, నిమజ్జనం సమయంలో విగ్రహాలు విరిగిపోవడం చేయకూడదని, అలా చేస్తే ఆ భగవంతుడికి మనపై కోపం వస్తుందని అంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాజమహేంద్రవరంలో విగ్రహాల నిమజ్జనం నదిమధ్యలో ఈ వీడియో చూపిన విధంగా చేశారు.
Related Posts
సోషల్ మీడియా కి బ్రేక్ ఇచ్చిన అనుష్క శెట్టి…
అనుష్క శెట్టి… మొన్నే తన Ghaati సినిమా తో ప్రేక్షకులని పలకరించింది… కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ మంచిగా వచ్చినా, అంత పెద్ద హిట్ అవ్వలేదు. దీంతో…
అనుష్క శెట్టి… మొన్నే తన Ghaati సినిమా తో ప్రేక్షకులని పలకరించింది… కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ మంచిగా వచ్చినా, అంత పెద్ద హిట్ అవ్వలేదు. దీంతో…
When does the soul attain moksha?
The Garuda Purana provides solutions to every problem we encounter in life.Especially for subjects like birth, karma, and moksha, it…
The Garuda Purana provides solutions to every problem we encounter in life.Especially for subjects like birth, karma, and moksha, it…
శృతి హాసన్ మంచి మనసు…
టాలీవుడ్ నటి శ్రుతీ హాసన్ మరోసారి తన పెద్ద మనసుతో అందరి హృదయాలను గెలుచుకుంది. అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఒక చిన్నారికి ఆమె చేసిన…
టాలీవుడ్ నటి శ్రుతీ హాసన్ మరోసారి తన పెద్ద మనసుతో అందరి హృదయాలను గెలుచుకుంది. అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఒక చిన్నారికి ఆమె చేసిన…