హనుమంతుని భక్తులంతా భక్తిపారవశ్యంతో పాడుకునే భక్తి గీతం హనుమాన్ చాలీసా. తులసీదాస్ రచించిన ఈ గీతం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయనపై మనకున్న భక్తిని పెంచుకోవడానికి, భయం నుంచి ఉపశమనం పొందడానికి, ఆయన నుంచి స్పూర్తి పొందడానికి ఉపయోగపడుతుంది. బాల్యం నుంచే పిల్లలకు హనుమాన్ చాలీసా నేర్పించాలి. అయితే, హనుమాన్ చాలీసా చదవడం రాకున్నా…యూట్యూబ్‌లో చాలీసా మనకు దొరుకుతుంది. శ్రావ్యంగా పాటరూపంలో పాడుకునేందుకు వీలుగా రూపొందించి రిలీజ్ చేశారు. హనుమాన్ చాలీసాపై ఎన్నో వీడియోలు మనకు డిజిటల్ ప్లాట్ఫామ్లో కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఈ హనుమాన్ చాలీసా 5 బిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఇన్ని వ్యూస్ సాధించిన మొదటి ఇండియన్ వీడియో హనుమాన్ చాలీసా కావడం విశేషం. దీన్ని బట్టి హనుమంతుడిపై ఎంతమందికి భక్తి ఉన్నదో అర్థమౌతున్నది.
Related Posts
జపాన్‌లో కీలక పరిణామం – ప్రధాని మోదీ బుల్లెట్ ట్రైన్ ప్రయాణం
2025 ఆగస్టు 30న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శిగేరు ఇషిబా టోక్యో నుంచి సెండై వరకు ప్రతీకాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రయాణం చేశారు.…
2025 ఆగస్టు 30న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శిగేరు ఇషిబా టోక్యో నుంచి సెండై వరకు ప్రతీకాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రయాణం చేశారు.…
సెమీ కండక్టర్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఎస్‌ఆర్‌కి చెందిన మొహాలీ సెమీకండక్టర్ లాబ్‌లో డెవలప్…
ఈరోజు భారత ప్రధాని ఢిల్లీలో సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఐఎస్‌ఆర్‌కి చెందిన మొహాలీ సెమీకండక్టర్ లాబ్‌లో డెవలప్…
థెరిసా జీవితాన్ని మలుపుతిప్పిన విజన్
విజన్ సైంటిస్ట్‌గా పేరుపొందిన థెరిసా పుతుస్సెరి తాను కోరుకున్న వైద్యరంగంలో స్థిరపడినా… కంటి సమస్యలపై లోతైన పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలుగా…
విజన్ సైంటిస్ట్‌గా పేరుపొందిన థెరిసా పుతుస్సెరి తాను కోరుకున్న వైద్యరంగంలో స్థిరపడినా… కంటి సమస్యలపై లోతైన పరిశోధనలు చేయాలనే లక్ష్యంతో పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలుగా…