ఆఫ్ఘాన్‌ శరణార్థులకు పాకిస్తాన్‌ అల్టిమేటం – దేశం విడిచి వెళ్లాలని ఆదేశం

పాకిస్తాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అనధికారికంగా ఎటువంటి పత్రాలు, దృవీకరణ పత్రాలు లేని శరణార్థులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఆఫ్ఘాన్‌ కౌన్సిల్‌ కార్యాలయం కూడా అధికారికంగా దృవీకరించింది. పాక్‌ ఇచ్చిన అల్టిమేటం ప్రకారం ఇచ్చిన సమయంలోగా దేశం విడిచి వెళ్లనివారిని బలవంతంగా దేశం నుంచి బయటకు పంపించివేస్తామని హెచ్చరించింది. దీంతో శరణార్థుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. వీలైనంత వరకు పాక్‌ను వీడి సొంత దేశాలకు వెళ్లేందుకు శరణార్థులు ప్రయత్నిస్తున్నారు.

శరణార్థులుగా పాక్‌ సరిహద్దుల్లో వేలాదిమంది ఆఫ్ఘాన్‌ జాతీయులు ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని దశాబ్ధాలుగా వీరు ఇక్కడ ఉంటున్నారు. ఇటీవల పాక్‌-ఆఫ్ఘాన్‌ మధ్య చిచ్చు రగులుకోవడంతో ప్రతీకారంగా పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా వేలాది కుటుంబాల్లో కంటిమీద కునుకులేకుండా పోయింది. దేశం విడిచి ఎలా వెళ్లాలో తెలియక, ఆఫ్ఘాన్‌ వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అర్ధంగాక, చావలేక బతలేక బతుకుతున్నారు. కాగా, ఇప్పటికే బలవంతంగా ఖాళీ చేయించి వారిని బయటకు పంపుతున్న దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమౌతున్నాయి. ఆర్మీ, పోలీసు బలగాల సహాయంతో ఈ బలవంతపు ఖాళీకి సిద్దమౌతున్నారు. ఇప్పటికే శరణార్థుల ఇంటిముందు అధికారులు నోటీసులు కూడా అంటించారు. శరణార్థుల్లో ఎక్కువమంది మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉండటంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.

వైభవోపేతంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మ ఉయ్యాల కంబాల ఉత్సవం

ఆఫ్ఘాన్‌ కాన్సులేట్‌ అభిప్రాయం ప్రాకం, చాలా ఏళ్ల క్రితం యుద్ధభయం, తాలీబన్‌ దాడుల భయం కారణంగా ఆఫ్ఘాన్‌ను వదిలి ఎటువంటి పాస్‌పోర్ట్‌ లేదా వీసాలు లేకుండా అడ్డదారుల్లో పాక్‌లోకి అడుగుపెట్టి జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు హటాత్తుగా అందర్నీ ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేందుకు కూడా పాక్‌ అధికారులు అవకాశం ఇవ్వడం లేదు. ప్రశ్నించిన వారిపై లాఠీచార్జ్‌ లేదా కాల్పులు జరుపుతున్నారు. దీంతో శరణార్థుల శిభిరాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. సడన్‌గా దేశం వదిలి వెళ్లమనడం మానవత్వానికి విరుద్దమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక యూఎన్‌ సహా పలు అంతర్జాతీయ సంస్థలు, మానవహక్కు సంఘాలు దీనిని లైవ్‌ హ్యూమానిటేరియన్‌ క్రైసిస్‌గా చెబుతున్నాయి. రాత్రికి రాత్రే వేలాదిమందిని బలవంతంగా తరలించడం వలన ఆకలి, ఆరోగ్య సమస్యలు, నివాసరాహిత్యం వంటి పరిస్థితులు ఎదురౌతాయని, మాస్‌ కిల్లింగ్‌ జరిగే అవకాశం ఉంటుందని, ఆకలి చావులు పెరుగుతాయని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాక్‌ మాత్రం తామిచ్చిన అల్టిమేటం ప్రకారం దేశం వదిలి వెళ్లిపోవాల్సిందేనని బల్లగుద్ది చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *