విజయనగరం పైడితల్లి ఉత్సవాలు ప్రారంభం

విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్‌, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్‌ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *