విజయనగరం కల్పవల్లి పైడితల్లి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విజయనగరానికి వస్తున్నారు. వచ్చే ఏడాది వరకు అమ్మవారి ఆలయం ఆధునీకరణ పనులు పూర్తవుతాయని, కొన్ని కారణాల వలన గత కొన్ని సంవత్సరాలుగా ఆధునీకరణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పాలకులు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సుఖాలు కలుగుతాయని, ఈతిబాధలు తొలగిపోతాయని భక్తులు చెబుతున్నారు.
Related Posts
మూడు రోజుల్లో 200 కోట్లు దాటేసిన పవన్ కళ్యాణ్ OG
ఏమనుకుంటున్నారు మరి… ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్టెప్ ఇన్ ఐతే చాలు, రికార్డ్స్ బద్దలే! ఎదో గ్రాఫిక్స్ బాలేని కారణంగా హరి హర వీర మల్లు వెనుక…
ఏమనుకుంటున్నారు మరి… ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్టెప్ ఇన్ ఐతే చాలు, రికార్డ్స్ బద్దలే! ఎదో గ్రాఫిక్స్ బాలేని కారణంగా హరి హర వీర మల్లు వెనుక…
లోక – మలయాళ సినిమా గేమ్ చెంజర్
మలయాళ సినీ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఫేజ్ లో ఉంది. 2018, మంజుమ్మెల్ బాయ్స్, తుదరుం వంటి సినిమాలు మలయాళ కథలు కూడా ఎంత దూరం…
మలయాళ సినీ ఇండస్ట్రీ ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఫేజ్ లో ఉంది. 2018, మంజుమ్మెల్ బాయ్స్, తుదరుం వంటి సినిమాలు మలయాళ కథలు కూడా ఎంత దూరం…
రాశిఫలాలు – 2026, జనవరి 9, శుక్రవారం… ఎలా ఉన్నాయంటే
ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో, పుష్యమాస బహుళ పక్ష షష్ఠి తిథి. ఉత్తరఫల్గుణి నక్షత్ర ప్రభావంతో పాటు శోభన యోగం ఉన్న ఈ శుక్రవారం…
ఈ రోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో, పుష్యమాస బహుళ పక్ష షష్ఠి తిథి. ఉత్తరఫల్గుణి నక్షత్ర ప్రభావంతో పాటు శోభన యోగం ఉన్న ఈ శుక్రవారం…