కూరల్లో కరివేపాకులా ఎందుకు తీసేస్తావని అంటుంటారు. అంటే కూరల్లో వేసే కరివేపాకు అంటే చాలా మంది చులకన భావం ఉంటుంది. కానీ, ఆ కరివేపాకు ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలను ఇస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈరోజు ఈ కథనంలో కరివేపాకు ప్రయోజాల గురించి తెలుసుకుందాం.
కరివేపాకును చులకనగా చూసినా… అది లేకుండా కూర వండితే రుచి రాదని అంటారు. ఈ కరివేపాకు కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు కూడా సహకరిస్తుంది. ఈ ఆకును మనం రెగ్యులర్‌గా డైట్‌లో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు అందంగా కూడా మనం కనిపిస్తాం. ఇక పరగడుపున కరివేపాకును నమలడం వలన పలు ప్రయోజనాలున్నాయి. ఊబకాయంతో బాధపడేవారు కరివేపాకు పరగడుపున నమలాలి. ఫలితంగా ఊబకాయం నుంచి బయటపడొచ్చు. ఇందులో హెపో ప్రొటెక్టీవ్ లక్షణాలు ఉంటాయి. కరివేపాకును రెగ్యులర్‌గా యూజ్ చేయడం వలన కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. విష పదార్ధాలను శరీరంలోనుంచి బయటకు పంపిస్తుంది.
కరివేపాకు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహకరిస్తుంది. కరివేపాకులో విటమిన్ సీ, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కరివేపాకు మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వకుండా నివారిస్తుంది. రక్తహీనతతో బాధపడుతున్నవారు కరివేపాకును నమలాలి. ఇందులో ఉండే ఇనుము, కాల్షియం, జింక్ రక్తహీనత నుంచి మనల్ని కాపాడుతాయి. రెగ్యులర్‌గా కరివేపాకు తీసుకోవడం వలన చర్మ ఆరోగ్యం బాగుపడుతుంది. తరచుగా కరివేపాకును తీసుకోవడం వలన తెల్ల జట్టు సమస్య నుంచి కూడా బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గిపోతుంది అంటారు.