విఘ్నరాజా వినాయకుడు అంటే భారతీయులకు ఎంతటి ఇష్టమో చెప్పక్కర్లేదు. తొలి పండుగతో పాటు నవరాత్రులు గణపతిని ఆరాధించి, భక్తితో పూజించి పదో రోజున గణపయ్యను వివిధ రకాలైన పువ్వులతో అలంకరించి, పలు రకాలైన వేదికలను ఏర్పాటు చేసి భక్తజన సందోహం మధ్య స్వామివారిని నిమజ్జనం చేస్తారు. మనదేశంతో పాటు అటు శ్రీలంక, బాలీలోనూ పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి. ఇక ఆఫ్రికా దేశంలోనూ హైందవ సంప్రదాయాలను ఫాలో అయ్యేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. ఘన దేశంలో ప్రతి ఏడాది హిందూ పండుగలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి.
ఇప్పుడు ఘన దేశంతో పాటుగా, మరో ఆఫ్రికా దేశం ఉగాండాలోనూ పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మేళతాళాల మధ్య గణపయ్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఉగాండాలో నివశించే భారతీయులతో పాటు, ఉగాండా దేశస్తులు కూడా ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ జయజయద్వానాలు చేస్తూ గణపతిని పూజిస్తున్నారు. ఉగాండా సంప్రదాయ డ్రమ్స్‌ను వాయిస్తూ, పాటలు పాడుతూ వేడుకలను నిర్వహించారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. భారత్‌తో పాటు ఆఫ్రికాలోనూ ఈ నవరాత్రి వేడుకలు భారీ స్థాయిలో జరుగుతుండటం విశేషమనే చెప్పాలి.