కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్‌చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts

గ్రహాల తిరోగమనంతో ఈ మూడు రాశులకు ఇక్కట్లే
Spread the loveSpread the loveTweetఆగస్టు 9, 2025న రాఖీ పౌర్ణమి రోజున భారతదేశ వ్యాప్తంగా అన్నా చెల్లెల సంబంధాన్ని గౌరవించే రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన…
Spread the love
Spread the loveTweetఆగస్టు 9, 2025న రాఖీ పౌర్ణమి రోజున భారతదేశ వ్యాప్తంగా అన్నా చెల్లెల సంబంధాన్ని గౌరవించే రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన…

సంసారులకు కాకి చెప్పిన సత్యం.. జీవితం ఎలా ఉండాలంటే
Spread the loveSpread the loveTweetమనిషిగా జన్మించడం ఒక వరం. కానీ ఆ జన్మను ధన్యం చేసుకునేందుకు, దాన్ని పరమార్థంగా మలచుకునేందుకు కావలసినదే సాధన చతుష్టయం. ఇది అనాదిగా భారతీయ…
Spread the love
Spread the loveTweetమనిషిగా జన్మించడం ఒక వరం. కానీ ఆ జన్మను ధన్యం చేసుకునేందుకు, దాన్ని పరమార్థంగా మలచుకునేందుకు కావలసినదే సాధన చతుష్టయం. ఇది అనాదిగా భారతీయ…