మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ ట్రైలర్ అదిరిపోయింది…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ముఖ్యంగా గ్లింప్స్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించగా, పాటలు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఈ కథలో ‘శంకర వర ప్రసాద్’ ఒకప్పుడు దేశ భద్రతకు సంబంధించిన వివిధ రహస్య సంస్థల్లో పనిచేసిన ఆపరేటివ్. అయితే ఆ జీవితానికి గుడ్‌బై చెప్పి, భార్య శశిరేఖతో ప్రశాంతమైన వైవాహిక జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. కానీ అనుకోని అడ్డంకులు అతని జీవితాన్ని తారుమారు చేస్తాయి. ఆ పరిస్థితులను శంకర వర ప్రసాద్ తనదైన స్టైల్‌లో ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే కథాంశం.

చిరంజీవి ఈ సినిమాలో లైట్‌హార్ట్‌డ్ రోల్‌లో కనిపిస్తూ మెగా అభిమానులకు పాత చిరు ని గుర్తు చేస్తున్నారు. ఆయన మెగా స్వాగ్, టైమింగ్‌కు తగ్గ హ్యూమర్, స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్ మొత్తం హైలైట్‌గా నిలిచాయి. ఇక చివర్లో వెంకటేశ్ ఇచ్చిన పవర్‌ఫుల్ మాస్ ఎంట్రీ ట్రైలర్ ఎనర్జీని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇద్దరు లెజెండ్స్ మధ్య జరిగే సరదా డైలాగ్ ఎక్స్చేంజ్ ప్రేక్షకులకు కనుల పండుగలా మారింది. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది… కొన్ని ఘంటల్లోనే 22M వ్యూస్ సాధించింది!

నయనతార సంప్రదాయ లుక్‌లో చాలా అందంగా కనిపించగా, చిరంజీవితో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్‌ను చూపించారు. చిరంజీవిని ఫన్‌ఫుల్ అవతార్‌లో ప్రెజెంట్ చేయాలన్న ఆయన విజన్ వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌ను సమపాళ్లలో మేళవిస్తూ పూర్తి కమర్షియల్ ప్యాకేజీని అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *