శ్రీకాళహస్తీశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆహ్వానం

Deputy CM Pawan Kalyan Invited to Srikalahasteeswara Swamy Shivaratri Brahmotsavams

•ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కొట్టే సాయిప్రసాద్

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ పగడాల మురళీ, ఆలయ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *