వామ్మో… వాయ్యో… ఏందిరా సామి ఇది… ఇది నేనెక్కడ చూడాలే… భూమి బద్దలయ్యేలా ఉందే… ఆమ్మో అమ్మోయ్… ఇన్ని expressions దేనికి అంటే, అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ పోస్టర్ గురించి అంటాం… ఇందాకే రిలీజ్ చేసిన ఈ పోస్టర్ తో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం అయ్యింది… అల్లు అర్జున్ బర్త్డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ ని ‘రాకా’ అని ప్రకటించి చంపేశారు… ఇక పోస్టర్ లో అల్లు అర్జున్ ని ‘Shakti’ సినిమా గుర్తుండే ఉంటుంది ద్దనిలో విలన్ లా చూపించి అదరగొట్టరు… ఓరి బాబు మన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్… అది మర్చిపోయారా ఏందీ??? సుకుమార్ అంటే అల్లు అర్జున్ ని పుష్ప రాజ్ చేసాడు… ఇక ఇప్పుడు అట్లీ ‘రాకా’ ని చేసాడు…
తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిసారీ కొత్తదనం కోసం ఎదురు చూసే అభిమానులకు మరో భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చగా మారింది. ఐకాన్ స్టార్ Allu Arjun ప్రముఖ దర్శకుడు Atlee కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుంచే సినీ ప్రపంచం మొత్తం ఈ సినిమాపై దృష్టి పెట్టింది. ఎందుకంటే ఒకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మరోవైపు భారీ కమర్షియల్ సినిమాలతో పేరు తెచ్చుకున్న అట్లీ… ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. అందుకే expectations వేరే లెవెల్ లో ఉన్నాయ్… అవి అలానే ఉంచామని లేటెస్ట్ పోస్టర్ మరో సారి రుజువు చేసింది!
ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇందాకే ట్విట్టర్, insta లో లాంచ్ చేసింది. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగి, ఏందయ్యా సామి అని పాటను మల్లి పాడుకుంటున్నారు… ఆ గుండు ఏంటి…ఆ గోర్లేంటి… ఆ కళ్లేంటి… ఆమ్మో ఏందీ అల్లు అర్జున్ ఆ కాదా… లేకపోతె మమ్మీ సినిమా లో విలన్ ని తెచ్చిపెట్టారు ఏంటి??? సమస్యే లేదు… ఈ సినిమా హిట్… బొమ్మ బ్లాక్బస్టర్… రాకా గా అల్లు అర్జున్ చంపేయబోతున్నాడు! ‘Prepare yourself for a vision beyond limits ‘ అంటే అర్ధం ఏంటి… అదే కదా… టైటిల్… టాగ్ లైన్… హీరో ఫస్ట్ లుక్… ఇది చాలు ఈ బర్త్డే కి!
ఐతే ఇక్కడ ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ చేతి వేళ్ళు కూడా ప్రత్యేకంగా ఉన్నాయ్… అంటే అల్లు అర్జున్ ఒక రాక్షసుడా??? చేతి వేళ్ళు vampire లాగ ఉన్నాయి… ఆల్రెడీ తమ్మ సినిమా లో రష్మిక ని చూసాం కదా… అలా ఎమన్నా వాంపైర్ లా మారతాడా??? ఆమ్మో ఇన్ని డౌట్స్ తో బుర్ర బద్దలవుతుంది…
అసలు సినిమా పేరు ప్రకటించగానే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు భారీగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కొత్త క్యాచీ టైటిల్ ప్రకటించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది అభిమానులు “ఇది పూర్తిగా కొత్త తరహా సినిమా కావచ్చు” అని కామెంట్లు చేస్తున్నారు.
అందుకే ప్రస్తుతం రాకా అనే టైటిల్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఈ టైటిల్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అభిమానులు పోస్టర్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.