నవగ్రహ దోషాల నుంచి ఎలా విముక్తి పొందాలి

How to Get Relief from Navagraha Doshas Remedies and Spiritual Solutions
Spread the love

సూర్యదోషం ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద రాగిపాత్రలో నీటిని నింపి పెట్టుకోవాలి. చంద్రదోషం నుంచి బయటపడాలంటే వెండి పాత్రలో నీటిని పోసి మంచంకింద ఉంచుకోవడంగాని లేదా వెండి ఆభరణాలను దిండుకింద ఉంచుకోవడంగాని చేయాలి. మంగళదోషం నుంచి బయటపడాలంటే కంచు పాత్రలో నీటిని పోసి మంచం కింద ఉంచుకోవాలి. జాతకంలో బుధ దోషం ఉన్నట్టైతే రాత్రి పడుకునే ముందు దిండుకింద బంగారు ఆభరణాలను ఉంచుకోవాలి. గురుదోషం ఉన్నవారు పసుపు ముద్దను గుడ్డలో చుట్టి తలకిందపెట్టుకోవాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నుదిటిపై తిలకం దిద్దుకోవడం వలన రాహు దోషం నుంచి బయటపడతారు. జంతువులకు ఆహారాన్ని అందించడం వలన కేతువు సంతోషిస్తాడు. ఫలితంగా ఈ దోషం ఉన్నవారికి మంచి చేస్తాడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే వెండి చేపను దిండుకింద ఉంచుకోవాలి. నీలం రంగు రత్నాన్ని దిండుకింద ఉంచుకోవడమో లేదా ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడమో చేయడం వలన శనీశ్వరుని దోషం నుంచి బయటపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *