అనుష్క శెట్టి… మొన్నే తన Ghaati సినిమా తో ప్రేక్షకులని పలకరించింది… కానీ ఆ సినిమా ఓపెనింగ్స్ మంచిగా వచ్చినా, అంత పెద్ద హిట్ అవ్వలేదు. దీంతో అనుకున్నంత ఎలివేషన్ రాలేదు స్వీటీ కి… ఐతే ఈరోజు అభిమానులకు ఒక పెద్ద షాక్ ఇచ్చింది మన అనుష్క… సడన్ గా సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న అని చెప్పి ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది.
తెలుగు తెరపై లేడీ సూపర్‌స్టార్‌గానూ, తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అనుష్క శెట్టి కి ఘాటీ ద్వారా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. కథ, నెరేషన్, అనుష్క పాత్రపై విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా విడుదలకు ముందే డిజిటల్ ప్రమోషన్స్‌లో టెలిఫోన్ ఇంటర్వ్యూలతో చురుకుగా పాల్గొన్నా… విడుదల తర్వాత అనుష్క నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
ఈ మధ్యలో అనుష్క ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానుల తో కొంత కాలం సోషల్ మీడియాలో దూరంగా ఉండబోతున్నానని ప్రకటించింది. “బ్లూ లైట్‌ను కాండిల్ లైట్‌గా మార్చుకుంటున్నా… స్క్రోలింగ్ దాటి నిజ జీవితంలో మళ్లీ కలిసిపోవడానికి, మనం మొదలైన చోటుకే తిరిగి వెళ్ళడానికి కొంత విరామం తీసుకుంటున్నా. తర్వాత మరిన్ని కథలతో, మరింత ప్రేమతో కలుస్తా” అంటూ పోస్ట్ చేసింది.
ప్రస్తుతానికి ఆమె కొత్త తెలుగు సినిమాకి సైన్ చేయలేదు. అయితే, మలయాళ భాషలో రూపొందుతున్న కథనార్: ది వైల్డ్ సోర్సరర్ చిత్రంలో ఆమె శక్తివంతమైన పాత్రలో కనిపించబోతుంది.