ఈ దేశాల్లో ఒక్క విమానాశ్రయం కూడా లేదంటే నమ్ముతారా?

ఎక్కడైనా అభివృద్ధి చెందాలి, అభివృద్ది కనిపించాలి అంటే అక్కడ రవాణా సౌకర్యాలు అనేవి తప్పకుండా ఉండాలి. రవాణా లేకుండా ఉండే మారుమూల ప్రాంతాల్లో అభివృద్ది అన్నది చాలా వరకు కనిపించదు. ఈ రోజుల్లో విదేశీయులను ఎక్కువగా ఎట్రాక్ట్ చేయగలిగితే చాలు ఆ ప్రదేశాలు తొందరగా అభివృద్ధిని సాధిస్తాయి. విదేశీయులు ఆయా ప్రాంతాలకు రావాలి అంటే తప్పనిసరిగా విమాన మార్గాలు ఉండాల్సిందే. టెక్నాలజీ, సైన్స్‌ ఇంతగా అభివృద్ధి సాధించిన తరువాత కూడా చాలా దేశాల్లో విమానాశ్రయాలు లేవు. మరి విమానాశ్రయాలు లేని ఆయా దేశాలేంటో ఇప్పుడు చూసేద్దామా..

ఇందులో మొదటగా చెప్పుకోవలసింది వాటికన్‌ సిటీ గురించే. ప్రపంచంలోనే చిన్నదేశం ఇది. ఇక్కడ ఒక్క విమానాశ్రయం కూడా లేదు. కారణం ఏమంటే విమానాశ్రయం నిర్మించాలి అంటే చాలా స్థలం కావాలి. కానీ, విమానాశ్రయం నిర్మించేంత స్థలం ఇక్కడ లేకపోవడంతో నిర్మించలేకపోయారు. వాటికన్‌ సిటీ రావాలి అంటే పక్కనే ఉన్న రోమ్‌ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి వాటికన్‌ సిటీకి రావాలి. అదేవిధంగా ప్రపంచంలోనే 16వ చిన్నదేశమైన ఆండోర్రా దేశంలోనూ విమానాశ్రయం లేదు. ఈ దేశం చుట్టుపక్కలంతా కొండలు, పర్వతాలే. ఈ కారణంచేత ఇక్కడ విమానాశ్రయం నిర్మించలేదు. అయితే, ప్రైవేట్‌ సంస్థలు సొంతంగా మూడు ప్రాంతాల్లో హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేసుకున్నారు.

విమానాశ్రయాలు లేని మరో దేశం మొనాకో. ఇది ఇటలీ ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఉంటుంది. ఇక్కడకూడా విమానాశ్రయం నిర్మించలేదు. ఇక్కడికి రావాలి అనుకుంటే సమీపంలోని ఫ్రాన్స్‌ నుంచి లేదా ఇటలీ నుంచి మాత్రమే రావలసి ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారానే మొనాకో చేరుకోవాలి. ఇటలీకి సమీపంలో ఉన్న మరో ముఖ్యమైన దేశం శాన్‌మారినో. ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు. ఇటలీ నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు శాన్‌ మారినోను సందర్శిస్తుంటారు. కారణం ఈ చిన్నగా ఉన్నా చాలా అందంగా ఉంటుంది. ఈ అందమే పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అదేవిధంగా స్విట్జర్లాండ్ ఆస్ట్రియా మధ్య ఉన్న మరోదేశం లీష్టెన్‌స్టైన్. ఇక్కడ కూడా విమానాశ్రయం లేదు. స్విట్జర్లాండ్‌లోని సెంట్ గాల్-ఆల్టెన్‌రైన్ (St. Gallen-Altenrhein), జ్యూరిచ్ (Zurich) విమానాశ్రయాల ద్వారా లీష్టెన్‌స్టైన్‌కు చేరుకుంటారు. ఈ చిన్న దేశాలు ఆయా దేశాలకు వచ్చే ఆదాయంలో ఎక్కువశాతం పర్యాటకం నుంచే వస్తోంది. ప్రయాణ మార్గాలు తక్కువగా ఉన్నా అక్కడి యూనిక్‌నెస్‌ కారణంగానే ఆదాయం లభిస్తోంది.

For More

Curry Leaves గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *