జగజ్యోతి, అపర వాల్మీకి శ్రీశ్రీశ్రీ శివానంద పరమహంసల వారి జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా కృత్తిక నక్షత్రం రోజైన లక్ష్మింవారు కడు వైభవంగా జరిగాయి. అమెరికా, మెల్బోర్న్, భారత దేశంలోని పలు చోట్లతో పాటు శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలోని, విజయవాడ భవాని పురం, మచలీపట్నం, విశాఖ, అనంతపురం, సిక్కోలు, పార్వతీపురం, అలాగే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాలలో జయంతి వేడుకలు జరిగాయి. ప్రధానంగా ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస సద్గురు శ్రీశ్రీశ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ శ్రీ స్వామి అంతర్ముఖానంద వారిచే ఆధ్యాత్మిక భాషణం జరిగింది.
ఈ సందర్బంగా శ్రీగురూజీ శిష్యులనుద్దేశించి… మూడు అవస్థలు దాటితేనే ఆ చివరి అవస్థే ముక్తికి మార్గమన్నారు. ప్రాణాపానాలను రాపిడి చేయడం ద్వారా వచ్చే శబ్దమే ఓం కారమని దే ప్రణవనాదమని, దాన్నే బ్రహ్మనాదమన్నారు. నిత్యం దాన్ని సాదన చేయడం ద్వారానే అద్వైత స్థితిని తెలుసుకుంటామన్నారు. ఆశ్రమంలో జరిగిన జయంతి కి ప్రముఖ శిష్యులు శివ, జగ్గారావు, తిరుమల, హిందీ మేషారు, సోమేశ్వరరావు, ఠాగూర్, శ్రీను, లక్ష్మణరావు, డా. సుబ్రహ్మణ్యం, ప్రభాకర్, రవిశాస్త్రి, చక్రవర్తి, విజయగోపాలతో పాటు దాదాపు 250మంది శిష్యులు హాజరయ్యారు