తిరుమలలో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆషాఢంలో సాధారణంగా భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ, ఆషాఢం నడుస్తున్నప్పటికీ తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్నది. ఆదివారం అంటే జులై 13వ తేదీన తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆదివారం ఒక్కరోజే 80,193 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా టీటీడీ అధికారులు తెలియజేశారు. ఇక 33,298 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్టుగా అధికారులు తెలిపారు. ఆదివారం రోజున హుండీ ద్వారా 4.43 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. సాధారణ భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక శనివారం రోజున రికార్డుస్థాయిలో భక్తులు శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. శనివారంనాడు స్వామిని 92,221 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 42,280 మంది భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించారు. ఇక హుండీ ద్వారా 3.51 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అటు అధికారులు కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లో ఉన్నవారికి అన్నపానీయాలు అందజేస్తున్నారు. క్యూకాంప్లెక్సులో ఉన్న వారికి కూడా ఆహారాన్ని అందిస్తూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Related Posts
సుధీర్ బాబు జటాధరా కలెక్షన్ రిపోర్ట్
ఈ మధ్య కాలం లో టీజర్ తోనే చాల ఎక్సపెక్టషన్స్ పెంచిన సినిమా సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధరా’… రిలీజ్ అయ్యాక సూపర్ హిట్…
ఈ మధ్య కాలం లో టీజర్ తోనే చాల ఎక్సపెక్టషన్స్ పెంచిన సినిమా సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధరా’… రిలీజ్ అయ్యాక సూపర్ హిట్…
వార్ గేమ్ చేంజర్‌గా మారనున్న BTS VAB S-76
రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ భారీ లిఫ్ట్ డ్రోన్ తయారీకి శ్రీకారం చుట్టింది. అన్‌మ్యాండ్ ఎయిరియల్ సిస్టమ్స్‌లో భాగంగా BTS VAB S-76ను రూపొందింది. ఇది కార్గో…
రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ భారీ లిఫ్ట్ డ్రోన్ తయారీకి శ్రీకారం చుట్టింది. అన్‌మ్యాండ్ ఎయిరియల్ సిస్టమ్స్‌లో భాగంగా BTS VAB S-76ను రూపొందింది. ఇది కార్గో…
గద్దర్ అవార్డ్స్ 2025 : మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం…
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడు అంటే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. అందుకే అంతటి లెజెండరు నటుడికి ఈరోజు ఆయనకి గద్దర్…
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నటుడు అంటే ఫస్ట్ మనకి గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. అందుకే అంతటి లెజెండరు నటుడికి ఈరోజు ఆయనకి గద్దర్…