- శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు
“వనసేన.. ప్రకృతిని కాపాడే సేన” అనే పేరుతో 52 మంది సభ్యులు బృందంగా ఏర్పడి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ జీవీఎంసీకి అప్పజెప్పి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న తీరు అభినందనీయమని శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు స్పష్టం చేశారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జనసమూహం ఎక్కువగా ఉండే టూరిస్టు ప్రదేశాల్లో, దేవాలయాలు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి జీవీఎంసీకి అప్పజెప్తున్న విధానం వారి సేవాగుణానికి నిదర్శనమని అన్నారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరిస్తే పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చునని శ్రీ నాగబాబు గారు పిలుపునిచ్చారు.
“వనసేన” బృందంలో సభ్యుడిగా తానుకూడా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణలో పాల్గొంటానని తెలియజేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ పంచకర్ల సందీప్, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్, “వనసేన” సభ్యులు ధర్మేంద్ర, మంజునాథ్, మురళీ, గణేష్, రాజేష్, చందు, నర్సింగ్, శంకర్, అభి, జ్యోతి, ప్రవల్లిక, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.