ఈ ప్రపంచమే ఓ వింత. ఇందులో జరిగేవన్నీ వింతలే. కొన్ని వింతలు మనిషిని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఆలోచింపజేస్తుంటాయి. పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తుంటాయి. మనలో తెలియని ఉత్కంఠను రేకెత్తిస్తుంటాయి. ఎలాగైనా మిస్టరీని చేధించాలనే దృక్పదాన్ని మనలో కలిగిస్తుంటాయి. అయినా వాటి పజిల్స్‌ను పరిష్కరించడం సాధ్యంకాదు. దేవుడి సృష్టిలో మనకు తెలియని వాటి గురించి తెలుసుకొని ఆనందించడం తప్పించి మరేమి చేయలేం. అటువంటి వింతల్లో ఒకదాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.
అగ్నిని ఆర్పాలంటే నీరు కావాలి. లేదా గాలి ప్రసరించకుండా నిలిపివేయాలి. గాలి ప్రసరించకుండా నిలిపివేయడం సాధ్యంకాదు. కానీ, నీటిని అగ్నిపై పోస్తే ఆరిపోతుంది. అగ్నిప్రమాదాలు సంభవించినపుడు నీటిని పోసి ఆర్పేస్తుంటారు. ఇదంతా మనకు తెలిసింది. కానీ, తెలియంది ఇంకా చాలా ఉంది. ఈ నీరే అగ్నిలా మారితే ఎలా ఉంటుంది. నీరు అగ్నిలా మారడమేంటి అంటే అది అంతే అంటున్నారు Madhya Pradesh లోని Panchamarshi ప్రజలు. పంచమర్షి పరిధిలోని Piparia అనే ప్రాంతంలో నీటికోసం తవ్వగా నీరు బయటపడింది. అక్కడ బోరు వేయాలనే ఉద్దేశంతో పంపును ఫిక్స్ చేశారు. అయితే, ఆ బోరు నుంచి వస్తున్న నీటిని చేతితో తాకితే మామూలు నీరులాగే ఉంటుంది.
కానీ, ఆ నీటిలో కాగితాన్ని ఉంచితే భగ్గున మండుతుంది. మంటరాజేస్తుంది. అందులో ఏమైనా పెట్రోల్ ఉందేమో అని వాసన చూస్తే ఎలాంటి వాసన లేకుండా నీళ్ల మాదిరిగానే ఉన్నాయి. కానీ, కాగితం పెట్టగానే మంట వస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియోలు, Social Mediaలో వైరల్ అవుతున్నాయి. పంచమర్షి ప్రాంతాన్ని పర్యాటకలు సందర్శించి ఆశ్చర్యపోతున్నారు. యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుందా అని నాస్తికులు నెత్తి పట్టుకుంటే, దైవం మహిమేనని, ప్రకృతిలో దేవుడు ఉన్నాడని, అప్పుడప్పుడు మనల్ని హెచ్చరించేందుకు ఇలాంటి దృశ్యాలను చూపుతుంటాడని అంటున్నారు. ఏది ఏమైనా ప్రపంచ వింతల్లో ఈ పంచమర్షి నీటి మంట కూడా ఒకటని చెప్పవచ్చు.