భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఈ మధ్య అంటే గత పదేళ్ల కాలంలో కొత్తగా వందలాది ఆలయాలు నిర్మించారు. ఎన్ని ఆలయాలు నిర్మించినప్పటికీ… పురాతన ఆలయాలతో వీటిని పోల్చడం చాలా కష్టం. ఆలయం వయసు పెరిగేకొలది అక్కడ మిస్టీరియస్ శక్తుల ప్రభావం పెరుగుతూ ఉంటుంది. దైవీక శక్తులు తమ ఉనికిని చాటుతుంటాయి. ప్రత్యక్షంగా మనుషులపై ప్రభావం చూపుతుంటాయి. సైన్స్‌కి అందని రహస్యాలు ఎన్నో ఆయా ఆలయాల్లో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని కనుగొనాలని, వాటి రహస్యాలను తెలుసుకోవాలని పరిశోధకులు, ఉత్సాహవంతులు, నాస్తికులు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. దైవం చూపించే అద్భుతాలను చూడాలే తప్పించి వాటిపై పరిశోధనలు చేయడం సాధ్యంకాదని ఇప్పటికే ఎన్నోమార్లు నిరూపణ జరిగింది. ఇలా భక్తులను ఆశ్చర్యంలో ముంచెత్తే ఆలయాల్లో ఒకటి Bihar రాష్ట్రంలో ఉంది. ఈరోజు ఆ ఆలయం గురించి తెలుసుకుందాం.
త్రిపురసుందరి ఆలయం
బీహార్ రాష్ట్ర రాజధాని Patnaలోని బస్తర్ అనే ప్రదేశం ఉంది. బస్తర్ అనగానే బీహార్ వాసులకు గుర్తుకు వచ్చేది రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి. దుర్గాదేవి అవతారాల్లో త్రిపురసుందరి దేవి అవతారం ఒకటి. ఇక్కడ ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటో తెలుసా… అమ్మవారు రాత్రి సమయాల్లో మాట్లాడటం. అవును మీరు విన్నది నిజమే. త్రిపురసుందరి దేవి రాత్రివేళ అక్కడే ఉన్న మరికొన్ని విగ్రహాలతో చక్కగా ముచ్చటిస్తుంటారు. ఇది కేవలం కల్పన అనుకుంటే పొరపాటే. అమ్మవారు మాట్లాడటం ఎందరో భక్తులు స్వయంగా చూశారు కూడా. భక్తులు అనుభూతి చెందారు కూడా. వారి అనుభవాలను పంచుకున్నారు కూడా. అందుకే బీహార్‌ను సందర్శించే పర్యాటకులు, భక్తులు బస్తర్ అమ్మవారిని దర్శిస్తుంటారు.
ఆలయ చరిత్ర
అమ్మవారి గురించి తెలుసుకునే ముందు ఆలయ చరిత్రను కూడా తెలుసుకోవాలి. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని తాంత్రిక పూజలను నిర్వహించే భవానీ మిశ్రా అనే వ్యక్తి నిర్మించారు. ఇక్కడి ఆలయంలో ప్రధాన దేవత రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి అయినప్పటికీ… ప్రాంగణంలో బతుకు బహీరవ, దత్తత్రే భైరవ, అన్నపూర్ణ భైరవ, కాల భైరవ, మంగండి భైరవ, భగలాముఖి, తారాదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న అన్ని విగ్రహాలకు రాత్రికాగానే శక్తి వచ్చేస్తుంది. అమ్మవార్లందరూ ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటాయి. అందులోనూ స్థానిక భాషలోనే మాట్లాకుంటాయని భక్తులు చెబుతున్నారు. చాలా మంది దీనిని మూఢనమ్మకం అని కొట్టిపారేస్తున్నారు. నిత్యం అమ్మవారిని కొలుస్తూ పూజిస్తూ అమ్మను గురించే నిత్యం స్మరిస్తూ ఉండటం వలన ఇలా అనిపిస్తుందని చెప్పేవారు లేకపోలేదు. కానీ, ఆలయాన్ని దర్శించిన వారు రాత్రి వేళల్లో వచ్చే శబ్దాలను గమనించినవారు అవాక్కవుతూ… ఎక్కడి నుంచి శబ్దాలు వస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారు. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నదే చిక్కు ప్రశ్న.
స్థానిక ప్రజలేం చెబుతున్నారు
అమ్మవారిని పూజించే భక్తులు చెప్పిన మాటలను బట్టి అర్థరాత్రి సమయంలో ఆలయం లోపలి నుంచి వింత శబ్దాలు వినిపిస్తుంటాయట. ఆలయాన్ని నిర్మించిన వంశస్తులే నేటికి పూజారులుగా కొనసాగుతున్నారు. ఓరోజు ఆలయంలో పూజారులు అర్థరాత్రి సమయంలో అవసరం నిమిత్తం ఆలయానికి వెళ్లగా… గర్భగుడి లోపలినుంచి వింత శబ్దాలు రావడం గమనించారు. దీంతో ఆశ్చర్యపోయిన పూజారులు ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో అటువైపుగా వెళ్లినవారికి తప్పకుండా ఈ వింత శబ్దాలు వినిపిస్తాయని, పండితులు చెబుతున్నారు. తాంత్రికమైన శక్తుల వలనే ఇలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయిన కొందరి అభిప్రాయం. కానీ, పూజారులు మాత్రం అమ్మవార్లే మాట్లాడుకుంటున్నారని అంటున్నారు.
చేధించలేని రహస్యం
మాటలు, వింత శబ్దాల రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ చేధించలేకపోయారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా వింత శబ్దాలు, మాటలు రహస్యంగానే ఉండిపోయింది. దేవుడిని రాతిబొమ్మలా కాకుండా ఓ శక్తి ఉన్న దేవతగా భావించి అర్చిస్తే తప్పకుండా రాతి విగ్రహంలోనూ దేవుడు కనిపిస్తాడు. రాతి విగ్రహం మనతో తప్పకుండా మాట్లాడుతుంది. మన మొరను ఆలకిస్తుంది. మన సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కేవలం మన సమస్యలేకాదు, సమాజం, ప్రపంచంలోని పరిష్కారం కాలేని సమస్యలకు ఆ దైవం తప్పకుండా మార్గం చూపుతుంది. దీనికి కావలసిందల్లా సాయిబాబా చెప్పినట్టుగా శ్రద్ద, సబూరి. ఈ రెండూ మనిషికి తప్పనిసరిగా ఉండాలి. మనిషి ఆగడాలు శృతిమించినపుడు దైవం తన ఉనికిని చాటుకుంటాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.