కాజీపేటలో స్వయంభూవుగా వెలసిన శ్వేతారక మూల గణపతి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ ఉపాలయాల్లో ఒకటైన శ్రీ ప్రహ్లాద నరసింహస్వామి ఆలయంలో విశేషమైన పూజలు నిర్వహించారు. దేవాలయం ఇన్‌చార్జ్ దేవులపల్లి సదానందం ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అర్చకులు రోహిత్ ఉపాధ్యాయ హరికృష్ణ స్వామి ప్రత్యేకమైన అభిషేక క్రతువును నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజున ఆలయంలోని ప్రహ్లాద నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని దేవులపల్లి సదానందం తెలియజేశారు. ఈ పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, అరుణాదేవి, సుప్రజ, వెంటకసాయితేజ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Related Posts
రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టీజర్…
ఫుల్ ఎనర్జీతో, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ పొతినేని, ఇప్పుడు తన కెరీర్లో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మిస్ శెట్టి మిస్టర్…
ఫుల్ ఎనర్జీతో, యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో రామ్ పొతినేని, ఇప్పుడు తన కెరీర్లో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మిస్ శెట్టి మిస్టర్…
Devi Sri Prasad Just Loves The Way Rashmika’s ‘The Girlfriend’ Is Presented…
Tollywood’s ace actress Rashmika Mandanna is all basking with the success of her latest movie ‘The Girlfriend’. Being Rahul Ravindran’s…
Tollywood’s ace actress Rashmika Mandanna is all basking with the success of her latest movie ‘The Girlfriend’. Being Rahul Ravindran’s…