మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం కదా… లాస్ట్ ఇయర్ రిలీజ్ అయినా హరి హర వీర మల్లు సినిమా డీసెంట్ గా ఆడినా, సుజిత్ OG సినిమా మాత్రం బ్లాక్బస్టర్ అయ్యింది. సో, నెక్స్ట్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అందరం వెయిటింగ్. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడం తో ఇంకా ఎక్సపెక్టషన్స్ పీక్స్ లో ఉన్నాయ్.
అలానే ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ అన్నారు కాబట్టి, మెగా ఫాన్స్ కి డబుల్ ట్రీట్ అని ఆనందపడ్డాం. ఎలాగో ఇందాకే రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అని అనౌన్స్ చేసారు కదా… సో, ఇప్పుడు పెద్ది రిలీజ్ డేట్ కి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఇందాకే మేకర్స్ ఈ న్యూస్ ని సోషల్ మీడియా లో షేర్ చేసి ఇటు పవన్ ఫాన్స్ ని ఇంకా మెగా ఫాన్స్ ని ఖుష్ చేసారు…
ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు శ్రీలీల ఇంకా రాశి ఖన్నా కూడా ఉన్నారు. సో, మన పవన్ కళ్యాణ్ మళ్ళి లవర్ బాయ్ గా చూడడం ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ లో చూడడం ఫాన్స్ కి పూనకాలే!