15/06/2026
Rajamouli’s Silent Promotional Strategy for Varanasi Stuns Film Industry

Rajamouli’s Silent Promotional Strategy for Varanasi Stuns Film Industry

ఇటీవల రాజమౌళి చేస్తున్న ప్రతి చిన్న సినిమా ప్రొమోషన్ కూడా సినీ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం చేస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కి ఎంచుకున్న ప్రమోషన్ స్ట్రాటజీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారీ సినిమాల ప్రమోషన్లు అంటే హంగామా, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్టర్లు ఉంటాయి. కానీ రాజమౌళి మాత్రం అందుకు భిన్నంగా, చాలా నిశ్శబ్దంగా, ఎక్కువ నాయిస్ చేస్తున్నాడు!

అలాగే వారణాసి రిలీజ్ డేట్‌ను ప్రకటించిన తీరు అందరికీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో కాదు… నేరుగా వారణాసి నగరంలో ఒక భారీ పోస్టర్ ఏర్పాటు చేసి, అక్కడే విడుదల తేదీని రివీల్ చేయడం ఆయన ఆలోచనల స్థాయిని చూపించింది. ఆ ఒక్క పోస్టర్‌తోనే సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ తర్వాత మరో ఊహించని అడుగు వేశారు రాజమౌళి.

ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా, రాత్రి సమయంలోనే సినిమా తారాగణం హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలను విడుదల చేశారు. అవి బయటకు వచ్చిన తర్వాతే అసలు విషయం అర్థమైంది. ఆ ఇంటర్వ్యూల ద్వారా వారణాసి సినిమా గురించి కీలకమైన, విలువైన సమాచారం బయటపడింది. ఈ సినిమా ఒకే పార్ట్‌గా తెరకెక్కుతోందని, సీక్వెల్స్ ప్లాన్ లేదని స్పష్టత వచ్చింది. అంతేకాదు, మహేష్ బాబు ఒకే సీన్ కోసం ఆరు నెలల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న విషయం కూడా బయటపడింది.

అందరిలోకి మరింత ఆసక్తిని రేపిన అంశం ఏమిటంటే… మహేష్ బాబు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను పోషించేందుకు తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, మెంటల్ హెల్త్ ని కూడా పూర్తిగా మార్చుకున్నానని చెప్పడం. ఇది సాధారణ విషయం కాదు. ఇలాంటి అంశాలు సాధారణంగా పెద్ద పెద్ద హెడ్‌లైన్స్‌గా, సెన్సేషనల్ న్యూస్‌గా మారిపోతాయి. కానీ రాజమౌళి మాత్రం వాటిని ఎక్కడా హైప్ చేయలేదు.

Also Read  నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోతోంది గా…

ఈ ఇంటర్వ్యూలన్నీ చాలా సైలెంట్ గా సోషల్ మీడియా లో రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా అవే ఇప్పుడు సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్‌లో, సినిమా వెబ్‌సైట్లలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక్కడే రాజమౌళి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. వార్తలను సెన్సేషన్ చేయడం కాదు… సినిమా మీద బజ్ తీసుకొచ్చేలా చేసాడు!

దీంతో ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. రాజమౌళి తన సినిమాను అనవసర హైప్‌తో మార్కెట్ చేయాలనే ఉద్దేశంలో లేరు. చిన్న చిన్న అప్‌డేట్స్‌ను అనూహ్యంగా వదిలి, అవే తర్వాత పెద్ద చర్చగా మారేలా చేస్తున్నాడు. ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్ స్ట్రాటజీనే. ఈ విధంగా వారణాసి సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *