Apple Tea Benefits: యాపిల్‌ని తింటే కాదు…ఇలా తాగినా డాక్టర్‌తో పనిలేదు

This Apple Tea Can Improve Digestion and Overall Health

Apple Tea Benefits: రోజుకో యాపిల్‌ తింటే చాలు డాక్టర్‌ దగ్గరకు వెళ్లవలసిన పనిలేదని అంటారు. ఇది నిజమా అంటే నిజమే. రోజూ యాపిల్‌ తినేవారిలో చాలా వరకు రోగాలు కనిపించవు. అందుకే చికిత్స తీసుకునే సమయంలో కూడా యాపిల్‌ ఇవ్వమని చెబుతారు. చిన్నారులకు బాల్యం నుంచే యాపిల్‌ను అందజేయడం వలన వారిలో ఆరోగ్యం బలపడుతుంది. సీజనల్‌ వ్యాధుల నుంచి బయట పడతారు.

Bird Nests at Home: పక్షుల గూళ్లతో మీ ఇంటి జాతకం మారిపోతుంది… ఎలానో తెలుసా?

అయితే, యాపిల్‌ను తినేందుకు కొంతమంది ఇష్టపడరు. మరోవిధంగా యాపిల్‌ను ఎలా తీసుకోవాలి అంటే దానికి సమాధానం యాపిల్‌ టీ. యాపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లను పొయ్యిమీద పెట్టి అందులో కట్‌ చేసిన యాపిల్స్‌ వేయాలి. మీరు తయారు చేసుకునే టీకి సరిపడినట్టు రోజ్‌మేరి ఆకులను వేసుకోవాలి. వాటిని బాగా మరిగించిన తరువాత దించి వడకట్టాలి. ఇలా తయారు చేసుకున్న టీని ఉదయం ఒకసారి, మద్యాహ్నాం ఒకసారి తీసుకోవాలి. ఇలా ఒక వారం రోజులు చేసి చూడండి…మీ కడుపు మొత్తం సాఫీగా క్లీన్‌ అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం వంటి జబ్బుల నుంచి బయటపడతారు. మనిషికి ఎక్కువ జబ్బులు వచ్చేవి జీర్ణవ్యవస్థ సరిగా లేకుంటేనే. జీర్ణవ్యవస్థను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటే ఎలాంటి రోగాలు లేకుండా నిండు నూరేళ్లు హాయిగా జీవించవచ్చు.

Also Read  కరెంట్‌ ఖర్చు లేకుండా చీరలతోనే ఏసీ లాంటి కూలింగ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *