Bird Nests at Home: పక్షుల గూళ్లతో మీ ఇంటి జాతకం మారిపోతుంది… ఎలానో తెలుసా?

What Hindu Astrology Says About Sparrows, Pigeons and Bats

Bird Nests at Home: సాధారణంగా ఇంట్లో చిన్నచిన్న పక్షులు గూళ్లు కడుతుంటాయి. మనం ఇంట్లో ఎలా నివశిస్తామో అవికూడా వాటి అవసరార్ధం గూళ్లను నిర్మించుకొని అందులో తమ బిడ్డలను పెంచి పోషిస్తుంటాయి. పక్షులు గూళ్లు కట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అవి నిర్మించే గూళ్లను చూస్తే ఎంత పెద్ద ఇంజనీర్‌కు అయినా ఆశ్చర్యం వేస్తుంది. ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకునే విధంగా వాటి నిర్మాణాలు ఉంటాయి. అయితే, కొన్ని పక్షులు ఇంట్లో గూళ్లు నిర్మించుకుంటే ఇంటికి మంచిదని, మరికొన్ని పక్షులు ఇంట్లో గూళ్లు పెడితే అది ఆ ఇంటికి నష్టం వస్తుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇంట్లో పిచ్చుకలు గూళ్లు నిర్మించుకుంటే ఆ ఇంటికి చాలా చాలా మంచిది. గూడు పెట్టిన ఇళ్లు నిత్యం సుఖసంతోషాలతో కళకళలాడుతుంది. ఆనందంతో నిండిపోతుంది. అదేవిధంగా పావురాలు గూడు కట్టినా మంచిదే. పావురం గూడు ధనానికి సంకేతం. పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలిగా పేర్కొంటారు. అందుకే పావురం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ ఉన్నట్టే. ధనంతో పాటు శాంతి కూడా లభిస్తుంది. ఇంట్లో ఏ పక్షులు గూళ్లు పెట్టినా మంచిదే అంటారు. కానీ, గబ్బిలాలు ఇంట్లో గూళ్లు పెట్టకూడదు. గబ్బిలం ఇంట్లో ఉంది అంటే అది దురదృష్టానికి సూచన. మీరు ఏ పని మొదలుపెట్టినా అడుగు ముందుకు వేయదు. ఇంట్లో చీకాకులతో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రతికూల శక్తులు ప్రవేశించేందుకు అనుకూలంగా మారుతోంది. తెనెటీగలు కూడా ఇంట్లో ఉండకూడదని పండితులు చెబుతున్నారు. తేనెటీగల గూడు ఇంట్లో ఉంటే అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అంటున్నారు.

Also Read  అయ్యప్ప మకరజ్యోతి మూడుసార్లు ఎందుకు కనిపిస్తుందో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *