Karna: దానం ఈ మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రార్థించే పెదవుల కన్నా దానం చేసే చేతులు మిన్నా అంటారు. దానం గురించి చెప్పుకోవాలంటే కర్ణుడినే చెప్పుకుంటాం. బలి, శిభి చక్రవర్తిని చెప్పుకుంటాం. కుడిచేత్తో చేసే దానం ఎడమచేతికి తెలియకూడదని అంటారు. కష్టాల్లో ఉన్నవారికి కాసింత చేయూతనిస్తే చాలు… అంతకంటే గొప్పపని మరొకటి ఉండదు. మన దగ్గర ఉన్నదాంట్లో నుంచి కొంతభాగాన్ని మాత్రమే దానం చేయాలి. అంతేగాని, అప్పు తీసుకొని దానం చేయరాదు. దానం ఎవరికిపడితే వారికి చేయరాదు. అవసరంలో ఉన్నవారికి మాత్రమే దానమివ్వాలి.
Bird Nests at Home: పక్షుల గూళ్లతో మీ ఇంటి జాతకం మారిపోతుంది… ఎలానో తెలుసా?
బియ్యాన్ని దానం చేయడం వలన సమస్త పాపాలు నశించిపోతాయి. వెండిని దానం చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. బంగారాన్ని దానంగా ఇస్తే దోషాలు తొలగిపోతాయి. పండ్లను దానం చేస్తే మన బుద్ధి వికసిస్తుంది. సంపదలు పెరుగుతాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది పేదలకు, రోగులకు పండ్లను దానంగా ఇస్తుంటారు. ఇక పెరుగును దానం చేయడం వలన ఇంద్రియ నిగ్రహం పొందవచ్చని పండితులు చెబుతున్నారు. నెయ్యిని దానంగా ఇవ్వడం వలన రోగాలు తగ్గిపోతాయని అంటారు. పాలను దానం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తేనెను దానంగా ఇవ్వడం వలన సంతానం కలుగుతుందని, ఉసిరికాయలను దానం చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, కొబ్బరికాయలను దానం చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని, దీపాలను దానం చేయడం వలన కంటిచూపు మెరుగౌతుందని, గోవులను దానం చేస్తే రుణ విముక్తులౌతారని, పెద్దల నుంచి ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. కర్ణుడి అంతటి గొప్పవారు కావాలంటే భూమిని దానంగా ఇవ్వాలని, ఇలా చేసిన వారికి బ్రహ్మలోక దర్శనంతో పాటు ఈశ్వరలోక ప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. బట్టలను దానం చేస్తే ఆయుష్షు పెరుగుతుందని, అన్నదానం చేసిన వారికి పేదరికం నుంచి బయటపడతారని, సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.