చిన జీయర్ కు సవాల్

Chinna Jeeyar Sanatana Dharma controversy

సనాతన ధర్మం గురించి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేయడాన్ని శ్రీ స్వామి రామానంద యోగజ్జాన పీఠాధిపతి అంతర్ముఖానంద శ్రీగురూజీ తీవ్రంగా ఖండించారు. ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలస ఆశ్రమంలో జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి మంగళవారం జరిగింది. ఈ సందర్బంగా ఆశ్రమంలో శ్రీగురూజీ ప్రవచనలు చేస్తూ ఇటీవల చిన జీయర్ ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలు, అలాగే సినీ నటుడు ప్రకాష్ రాజే రామ, లక్ష్మణులపై వాగిన దాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆది శంకరుల జయంతి సందర్బంగా ఆశ్రమం లో తెల్లవారుజామున అఖండ జపం, పొద్దున్న సద్గురు పూజ ఆదిశంకరుల సహస్రం పఠించారు. అటు శ్రీ స్వామిజీ సమాధి మందిరంలో ఇటు ఆశ్రమం పీఠంలో పూజ జరిగింది. అనంతరం అల్పాహారం అయినా తరువాత శ్రీ గురూజీ దాదాపు రెండున్నర గంటల పాటు బౌద్ధిక్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో శివ, రమేష్, శంకరరావు, చక్రవర్తి, విజయ్ గోపాల్, లక్ష్మణరావు,మనోహర్,డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ హరగోపాల్ తో పాటు విజయవాడ, ఒంగోలు హైదరాబాద్ ల నుండీ శిష్యులు పాల్గొన్నారు.

Also Read  ఏడు కొండలవాడిని దర్శించుకోవాలంటే…24 గంటల వేచి ఉండక తప్పదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *