10/06/2026

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవులు ముగిసిన తరువాత కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఆదివారం రోజున శ్రీవారిని 84,424 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,872  మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం రోజున భక్తుల రద్దీ భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉచిత దర్శనం కోసం 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా, రూ. 300 టికెట్‌ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం కోసం టోకెన్‌ పొందిన భక్తులకు నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ఆదివారం రోజున హుండీ ద్వారా రూ. 4.06 కోట్ల ఆదాయం లభించింది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *