ప్లాన్‌ చేస్తే ధురంధర్‌లా కొట్టాలంతే…లైఫ్‌ సెటిలవుద్ది

Dhurandhar Series 3000 Crore Record

భారతీయ సినీ చరిత్రలో రికార్డుల వేట మొదలైతే అది ‘బాహుబలి’ లేదా ‘పుష్ప’ రేంజ్‌లో ఉండాలనుకుంటాం, కానీ వాటన్నింటినీ పక్కకు నెట్టేసి ‘ధురంధర్’ సిరీస్ ఇప్పుడు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్రాంచైజీ కేవలం రెండు భాగాలతోనే రూ. 3,000 కోట్ల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించి, కేవలం 26 రోజుల్లోనే దేశీయంగా రూ. 1,311 కోట్లు, విదేశాల్లో రూ. 416 కోట్లు కలిపి మొత్తంగా రూ. 1,727 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొదటి భాగం సాధించిన రూ. 1,307 కోట్ల రికార్డును కలిపితే, ఈ సిరీస్ మొత్తం వసూళ్లు రూ. 3,019 కోట్లకు చేరాయి.

విశేషమేమిటంటే, చైనా లేదా గల్ఫ్ దేశాల మార్కెట్ అండ లేకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రమోషన్ల కంటే కథా బలమే మిన్న అని నమ్మిన చిత్ర యూనిట్, రణవీర్ సింగ్ పవర్‌ఫుల్ యాక్షన్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి దిగ్గజాల నటనతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. బాహుబలి (రూ. 2,438 కోట్లు), పుష్ప (రూ. 2,092 కోట్లు) వంటి భారీ చిత్రాల లైఫ్ టైమ్ కలెక్షన్లను ధురంధర్ కేవలం 11 రోజుల్లోనే దాటేయడం సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒకే భాషలో విడుదలైనప్పటికీ ఇంతటి ప్రభంజనం సృష్టించడం రాబోయే భారీ యాక్షన్ చిత్రాలకు ఒక పెద్ద బెంచ్ మార్క్‌గా నిలుస్తోంది. ప్లాన్ చేస్తే ‘ధురంధర్’ లాగే కొట్టాలి, అప్పుడే రికార్డులైనా, లైఫ్ అయినా సెటిల్ అవుతుంది అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *