Native Async

భారతీయ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా నటిస్తున్న నటులు వీరే

Legendary Indian Actors Who Have Been Shining in the Film Industry for Over 50 Years
Spread the love

భారతీయ సినిమా పరిశ్రమ అంటేనే వివిధ భాషలు, సంస్కృతులు, అద్భుతమైన కథలతో నిండిన ఒక మహా సామ్రాజ్యం. ఇందులో కొందరు నటులు తమ నటనా జీవితాన్ని 50 ఏళ్లకు పైగా కొనసాగిస్తూ, తరాలు మారినా తమ అభిమానులను కట్టిపడేస్తున్నారు. ఈ నటులు కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా, ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్‌లు సెట్ చేసి, యువ నటులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈరోజు మనం అలాంటి కొందరు లెజెండరీ నటుల గురించి తెలుసుకుందాం.

1. కమల్ హాసన్ (65+ ఏళ్లు)

కమల్ హాసన్ తమిళ సినిమా ఇండస్ట్రీలో ‘ఉలగ నాయగన్’గా ప్రసిద్ధి చెందిన నటుడు. 1959లో ‘కలతూర్ కన్నమ్మ’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ భాషల్లో (తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం) 200కు పైగా సినిమాల్లో నటించారు. విక్రమ్, దశావతారం వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగా కూడా రాణించారు.

2. ధర్మేంద్ర (65 ఏళ్లు)

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర 1960లో ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో డెబ్యూ చేశారు. ‘షోలే’లో వీరూ ఠాకూర్ పాత్రతో అమరత్వం సాధించారు. 500కు పైగా సినిమాల్లో నటించి, యాక్షన్ హీరోగా, రొమాంటిక్ స్టార్‌గా రాణించారు. ఇప్పటికీ ‘రాకీ ఔర్ రానీ కీ ప్రేమ్ కహానీ’ వంటి చిత్రాల్లో కనిపిస్తున్నారు.

3. అమితాబ్ బచ్చన్ (56 ఏళ్లు)

‘బిగ్ బీ’గా పిలువబడే అమితాబ్ 1969లో ‘సాత్ హిందుస్తానీ’తో ప్రారంభమైంది తన కెరీర్. ‘జంజీర్’, ‘షోలే’, ‘డాన్’ వంటి హిట్లతో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా పేరు తెచ్చుకున్నారు. 200కు పైగా సినిమాలు, పద్మవిభూషణ్ వంటి అవార్డులు. ఇప్పుడు కూడా ‘కల్కి 2898 AD’లో నటిస్తున్నారు.

4. రజినీకాంత్ (50 ఏళ్లు)

సూపర్ స్టార్ రజినీకాంత్ 1975లో ‘అపూర్వ రాగంగల్’తో తమిళ సినిమాలో అడుగుపెట్టారు. ‘బాషా’, ‘శివాజీ’, ‘జైలర్’ వంటి చిత్రాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు. తెలుగు, హిందీలో కూడా సినిమాలు చేశారు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ అభిమానులను ఆకట్టుకుంటాయి. కూలీ సినిమాతో ఆయనలోని మరో కోణాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి వయసు శరీరానికేగాని మనసుకు, నటనకు కాదని తేల్చిచెప్పారు.

5. మమ్ముట్టి (54 ఏళ్లు)

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి 1971లో ‘అనుభవంగల్ పాలిచ్చకల్’తో ఎంట్రీ ఇచ్చారు. 400కు పైగా సినిమాలు, మూడు నేషనల్ అవార్డులు. ‘భ్రమయుగం’, ‘కన్నూర్ స్క్వాడ్’ వంటి ఇటీవలి చిత్రాల్లో నటిస్తున్నారు. వివిధ పాత్రల్లో రాణించారు.

6. నందమూరి బాలకృష్ణ (51 ఏళ్లు)

తెలుగు సినిమా స్టార్ బాలకృష్ణ 1974లో ‘తాతమ్మ కల’తో బాలనటుడిగా ప్రారంభమైంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హిట్లు. 100కు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నారు. హిందూపురం నుంచి మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.

7. ప్రేమ్ చోప్రా (65 ఏళ్లు)

బాలీవుడ్ విలన్ ప్రేమ్ చోప్రా 1960లో ‘ముద్రా’తో డెబ్యూ. ‘బాబీ’, ‘దోస్తానా’ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు. 380కు పైగా సినిమాలు, ఇప్పటికీ చురుగ్గా ఉన్నారు.

8. అస్రాని (59 ఏళ్లు)

కామెడీ నటుడు అస్రాని 1966లో ‘హరే కాంచ్ కీ చూడియాన్’తో ఎంట్రీ. ‘షోలే’లో జైలర్ పాత్రతో ఫేమస్. 300కు పైగా సినిమాల్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు.

ఈ నటులు భారతీయ సినిమాకు ఎనలేని సేవలు చేశారు. వారి అంకితభావం, నటనా ప్రతిభతో ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. భవిష్యత్తులో కూడా వారి సినిమాలు మనల్ని అలరిస్తాయి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *