భారతదేశం 15వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి నేడు పార్లమెంట్ భవన్‌లో ఓటింగ్ జరుగుతోంది. పదవిలో ఉన్న జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఎన్నిక జరుగుతోంది. ఎన్డీఏ అభ్యర్థి, సీనియర్ భారతీయ జనతా పార్టీ నేత, మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సి.పి. రాధాకృష్ణన్ పైచేయి సాధించనున్నారని భావిస్తున్నారు. ప్రతిపక్ష INDIA బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డితో పోలిస్తే, ఎన్డీఏ వద్ద 433 మంది ఎంపీల బలమైన మెజారిటీ ఉండటంతో రాధాకృష్ణన్‌కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బిజెడి, బిఆర్ఎస్ వంటి పార్టీల తటస్థ ధోరణి (abstention) కూటములపై వివాదాన్ని రేపింది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోదీ మొదటి ఓటు వేయడం, రాధాకృష్ణన్ విజయం పై ఉన్న భారీ అంచనాలకు మరింత ఊపు తీసుకొచ్చింది. అయితే, అటు ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డిని గెలిపించుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేసింది. మరి ఎవరు గెలవనున్నారు అన్నది మరికాసేపట్లోనే తేలిపోతుంది.