పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ…

Discussion Held with Civil Aviation Minister Ram Mohan Naidu on Proposed Airports in Telangana

తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్‌కు స‌మీపంలో నిర్మించ‌నున్న మామునూరు విమానాశ్రయాన్ని అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు.

❇️ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు గారితో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవ‌ల‌తో పాటు మెయింటెనెన్స్‌, ఓవ‌ర్‌హాల్, రిపేర్ స‌దుపాయాలు ఉండేలా చూడాల‌ని ఈ సందర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

❇️జౌళి, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో Warangal న‌గ‌రం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంద‌ని, వ‌రంగ‌ల్‌కు ద‌గ్గ‌ర‌లో రెండేళ్ల‌కోక‌సారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌ స‌మ్మ‌క్క‌ – సార‌ల‌మ్మ జాత‌ర మేడారంలో నిర్వహించడం వంటి విషయాలు, వాటి ప్రాధాన్యతలను వివరించారు.

❇️MamnoorAirport ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌తో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి న‌ల్గొండ, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌కు కేంద్రంగా ఉంటుంద‌ని ముఖ్యమంత్రి గారు వివ‌రించారు. మామునూరు నుంచి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విమాన రాక‌పోక‌లు సాగేలా ప‌నులు ప్రారంభించేలా అనుమతులను తక్షణం మంజూరు చేయాల‌ని కోరారు.

❇️ఆదిలాబాద్ విమానాశ్ర‌యానికి సంబంధించి అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు. ఆ విమానాశ్ర‌య ఏర్పాటుకు అద‌నంగా అవ‌స‌ర‌మైన 249.82 ఎక‌రాలు అంద‌జేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

❇️మామునూరు ఎయిర్‌పోర్ట్ ప‌నుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల‌ను అక్క‌డ‌కు పంపిస్తాన‌ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు గారు హామీ ఇచ్చారు.

ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *