దేశ వ్యాప్తంగా 2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు జరుగుతాయి – తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Nationwide Simultaneous Elections to Be Held in April 2029, Says Telangana CM Revanth Reddy

నిన్న దిల్లీలో కేంద్రమంత్రులను కలిసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా తో ఇష్టాగోష్టి నిర్వహించారు… అయన ఏమి మాట్లాడారంటే:

‘‘ఎన్టీఆర్‌ జాతీయ నాయకుడు.. అమీర్‌పేటలో ఆయన విగ్రహం పెట్టి తీరుతాం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తా. నూటికి నూరు శాతం మా ప్రభుత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌ లేదు. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం నాకు అవసరం లేదు. నేను ప్రజల అభిప్రాయం మాత్రమే తెలుసుకుంటాను. ఎస్‌ఐబీలో పరికరాల మాయంతో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు బయటపడింది. ఎస్‌ఐబీ ఫిర్యాదుతోనే ఆ కేసు దర్యాప్తు జరుగుతోంది. కిషన్‌రెడ్డి లేఖ రాస్తే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కూడా సీబీఐకి ఇస్తాం. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. 2018లో తెచ్చిన నిబంధనల మేరకే సింగరేణిలో టెండర్లు. సింగరేణి టెండర్లపై ప్రతి డాక్యుమెంట్‌ను అసెంబ్లీలో పెడతాం. ఆరోపణలు తప్పని తేలితే కిషన్‌రెడ్డి క్షమాపణలు చెబుతారా? సింగరేణి సంస్థ అప్పులు మా హయాంలో పెరగలేదు. సింగరేణికి కేసీఆర్‌ పెట్టిన బకాయిలే ఎక్కువ. సింగరేణి విషయంలో కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు. మెత్తగా ఉన్నానని.. కిషన్‌రెడ్డి నన్ను మాత్రమే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు లేరు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసి 6 నెలలు అయ్యింది. దీనిపై కేంద్రం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు. విద్యుత్‌ కొనుగోలు వ్యవహారం కేసును త్వరలోనే సీబీఐకి ఇస్తాం’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *