శృతి హాసన్ మంచి మనసు…

Shruti Haasan’s Kind Gesture Saves a Child’s Life with Bone Marrow Support

టాలీవుడ్ నటి శ్రుతీ హాసన్ మరోసారి తన పెద్ద మనసుతో అందరి హృదయాలను గెలుచుకుంది. అరుదైన జన్యు వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఒక చిన్నారికి ఆమె చేసిన సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మంచి పని చేసినందుకు ఆమెని అందరు అభినందిస్తున్నారు కూడా.

MSMD (Mendelian Susceptibility to Mycobacterial Disease) అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న ‘ఆళ్వి’ అనే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించిన సంగతి తెలుసుకుని తనకి అన్నింటా తోడు గా ఉంది. ఈ వ్యాధి నయం చేయడానికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తప్ప మరే మార్గం లేకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఆందోళనలో పడింది. దీంతో ఇలాంటి క్లిష్ట సమయంలో శ్రుతీ హాసన్ ఆ చిన్నారి కి సహాయం చేసారు.

వైద్య నిపుణులను సంప్రదించడం, సరైన హాస్పిటల్స్‌ను సూచించడం మాత్రమే కాదు… చికిత్సకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా శ్రుతీ అందించారు. ఆమె చేసిన సహాయం వల్లే చిన్నారి ఆళ్వి విజయవంతంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడగలిగింది.

ఈ విషయాన్ని ఆ చిన్నారి తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ చాల ఎమోషనల్ గా శృతి కి థాంక్స్ చెప్పారు.
“మా పాపకి మళ్లీ జీవితం ఇచ్చింది శ్రుతీ గారే. ఆమె లేకపోతే ఈ రోజు మా బిడ్డ మా మధ్య ఉండేది కాదు” అంటూ వారు చేసిన పోస్ట్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.

స్టేజ్‌పై, స్క్రీన్‌పై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా స్టార్ అంటే ఎలా ఉండాలో శ్రుతీ హాసన్ మరోసారి నిరూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *