టైటిల్ చూడంగానే నిజామా అనిపిస్తుంది… జనరల్ గా పండగ సీసన్స్ లో మనం ఒకే సారి ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రోజు వస్తాయి అంటేనే నిర్మాతలు ఒక రోజు, రెండు రోజులు ఆగి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నారు… అక్కడ ఇద్దరు వేరు వేరు హీరోల సినిమాలు కాబట్టి పర్లేదు. కానీ ఇక్కడ శ్రీ విష్ణు నటించిన రెండు సినిమాలు ఒకే రోజు గ్యాప్ లో థియేటర్స్ లోకి వస్తున్నాయి అంటే నిజంగా ఆశ్చర్యమే కాదా…
ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో పెద్దగా డీల్స్ జరగకపోవడంతో, సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ ఫైనల్ చేయడం స్టార్ హీరోలకే కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితుల్లో కూడా శ్రీ విష్ణు తన రాబోయే రెండు చిత్రాలు ‘మృత్యుంజయ్’ ఇంకా ‘విష్ణు విన్యాసం’ కోసం ముందుగానే ఓటీటీ ఒప్పందాలను పూర్తి చేసి సూపర్ అనిపించాడు.
కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘విష్ణు విన్యాసం’ సినిమా కూడా ‘మృత్యుంజయ్’ విడుదలైన అదే వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యదునాథ్ మారుతిరావు దర్శకత్వంలో, సుమంత్ నాయుడు జి నిర్మాణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ పూర్తి వినోదాత్మక చిత్రం ఫిబ్రవరి 28న థియేటర్లలోకి రానుండగా, ‘మృత్యుంజయ్’ ఫిబ్రవరి 27న విడుదల కానుంది. సమ్మర్ సీజన్లో భారీ సినిమాలు వరుసగా రానున్న నేపథ్యంలో ఈ ముందస్తు విడుదల తేదీలు సినిమాలకు అనుకూలంగా మారనున్నాయి.
తాజాగా విడుదలైన పోస్టర్లో శ్రీ విష్ణు పసుపు రంగు క్లాసిక్ బైక్‌పై స్టైలిష్‌గా రిలాక్స్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. రంగురంగుల ప్రింటెడ్ షార్ట్, రఫ్ బియర్డ్‌తో ఆయన లుక్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. సినిమా మూడ్‌కు సరిపోయే సరదా, క్విర్కీ టోన్‌ను ఈ పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తోంది.
సినిమా ప్రొమోషన్స్ ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. కాబట్టి ముందుగా గ్లింప్స్‌ను విడుదల చేయగా, తర్వాత టైటిల్ సాంగ్, ఆపై మెలోడీ లవ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ముఖ్యంగా వాలెంటైన్స్ డే రోజున వచ్చిన రొమాంటిక్ పాట ప్రేక్షకుల్ని వెంటనే ఆకట్టుకుని మంచి స్పందన అందుకుంది.
ఈ చిత్రంలో నయనా సారిక హీరోయిన్గా నటిస్తుండగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, ప్రేమ, సరదా భావాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.