రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది.
❇️ఉద్యోగుల ప్రమాద బీమా పధకం : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రమాద బీమా పథకానికి ఆమోదం తెలిపింది.
❇️ప్రజా ప్రభుత్వం తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్‌కోలో ఉద్యోగులకు విజయవంతంగా అమలు చేస్తున్న పథకం తరహాలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ఈ పథకాన్ని విస్తరించింది. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ. 1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది. 60 ఏళ్ల వరకు సహజ మరణానికి ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది.
❇️రాష్ట్రంలో ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2.38 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుంది.
❇️క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ : దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న ఆరోగ్య భద్రతకు క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది.
❇️తాజా స్కీమ్‌తో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ప్రైవేట్ ఎంపానెల్ హాస్పిటల్స్‌లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు.
❇️రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం కోసం ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేస్తారు. ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం వాటాగా చెల్లిస్తే, అంతే సమాన మొత్తంలో ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది.
❇️ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు, అంతే మొత్తంలో ప్రభుత్వ వాటా కలిపి మొత్తంగా రూ.1056 కోట్ల తో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలవుతుంది.
❇️డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (TVVP) డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా (DSH) మార్చాలని నిర్ణయించింది.
❇️రాష్ట్రంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు. ఇందులో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు సభ్యులుగా ఉంటారు.
❇️హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 4 గ్రామాలు : వికారాబాద్ జిల్లాలోని నవాబ్ పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్ పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్ఎండీఏ పరిధిలో చేర్చారు.
❇️హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం స్వాధీనం : మంత్రివర్గ సబ్ కమిటీ నివేదిక మేరకు మెట్రో ఫేజ్ -1 ను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి స్వాధీనం. మెట్రో ఫేజ్ 2 విస్తరణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ గా విస్తరణ.
❇️రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు కోసం 223.09 ఎకరాల భూమిని TGIIC బదలాయింపు.
❇️టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలోని 239 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటు.
❇️మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం గుమ్మడూరులో జేఎన్టీయూ అధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో 36 ఎకరాలు.
❇️మరో 21 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్తగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూముల కేటాయింపు.
❇️హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ (ఢిపెన్స్ ల్యాండ్) నుంచి తీసుకున్నందున సమాన విలువైన భూములు కింద రక్షణ శాఖకు కాప్రా మండలంలో 153 ఎకరాలు బదలాయింపు.
❇️భద్రాచలంలో గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమి కేటాయింపు.
❇️తిరుమల తిరుపతి దేవస్థానం (#TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు కేటాయించింది.
❇️కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణానికి 3.12 ఎకరాల దేవాదాయ శాఖకు కేటాయించింది.
❇️క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ.
❇️మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి గారు, అడ్లూరి గారు, వాకిటి శ్రీహరి గారు మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త – ప్రమాద బీమా, క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు కేబినెట్ ఆమోదం