పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రెండు ఆసక్తికరమైన అప్‌డేట్స్ ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. మొదట ఈ నెల 26న విడుదల చేయాలని ప్లాన్ చేసిన చిత్రాన్ని ఇప్పుడు 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “మా ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద భారీ సంబరాలు మొదలుపెట్టడానికి వారం ముందే వస్తున్నారు” అంటూ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటనతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఐతే దీనికి కారణం ఏంటో తెలుసా??? యాక్టుల్ గా మార్చ్ 19 కి రణవీర్ సింగ్ ధురంధర్ సీక్వెల్ ఇంకా యాష్ టాక్సిక్ సినిమా రిలీజ్ అవ్వాల్సింది!
కానీ నిన్ననే యాష్ టాక్సిక్ సినిమా రెండు నెలలు పోస్టుపోన్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు… దీనికి కారణం అమెరికా, ఇరాన్ యుద్ధం… ఎస్, ఈ సినిమా గల్ఫ్ కంట్రీ లో కూడా మంచి ఎక్సపెక్టషన్స్ ఉండడం తో పరిస్థితులు సర్దుమణిగాక జూన్ 2nd కి రిలీజ్ చేస్తామని వారు ఒక నోట్ రిలీజ్ చేసారు…
అలాగే ధురంధర్ సీక్వెల్ నుంచి కూడా ఎలాంటి updates లేవు… సినిమా రిలీజ్ డేట్ కి ఇంకా కొన్ని రోజులే ఉండగా, టీం మాత్రం ఇంకా టీజర్ కానీ, గ్లింప్సె కానీ రిలీజ్ చేయలేదు. సో, ఈ సినిమా కూడా పోస్టుపోన్ అవచ్చు అని అంటున్నారు…
ఇదిలా ఉండగా విడుదల తేదీ మార్పు ప్రకటించడానికి ఒకరోజు ముందే చిత్ర యూనిట్ మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నేపథ్య సంగీతం (BGM) బాధ్యతలను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ కు అప్పగించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
ఈ విషయంపై నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సినిమాలోని పాటలకు డీఎస్పీ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని వారు ప్రశంసించారు. అయితే ఫైనల్ రీల్స్‌ను ఆయనకు పంపడంలో తమ వైపు నుంచి ఆలస్యం జరిగిందని అంగీకరించారు. దీంతో ఇతర ప్రాజెక్టుల కారణంగా డీఎస్పీకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేయడానికి సమయం సరిపోకపోవడంతో, పరస్పర అంగీకారంతో ఆ బాధ్యతలను తమన్‌కు అప్పగించినట్లు తెలిపారు.
ఇకపై ఈ చిత్రానికి పాటలను డీఎస్పీ అందిస్తుండగా, నేపథ్య సంగీతాన్ని తమన్ సమకూర్చనున్నారు. సినిమా నిర్మాణంలో ఎలాంటి ఆలస్యం లేకుండా, ప్రేక్షకులకు ఉత్తమమైన అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు ఒకే సినిమాకు పనిచేయడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ అని, థియేటర్లలో ఈ సినిమా మ్యూజిక్ ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.