24/06/2026
CM Revanth Reddy Distributes ₹1 Crore Insurance Cheques to Families of Deceased Power Department Employees

CM Revanth Reddy Distributes ₹1 Crore Insurance Cheques to Families of Deceased Power Department Employees

విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు ఇతర మంత్రుల సమక్షంలో బాధితులకు చెక్కులను అందించారు.

✅మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క గారిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అభినందించారు. విద్యుత్ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేష్, ముఖ్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులు అందించారు.

Image

✅#RajivAarogyasri పరిమితిని రూ. 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచాం. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ. 5 లక్షల బీమా వర్తిస్తుంది. కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదని కుటుంబ బీమా తీసుకొచ్చాం.

✅ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో మనోధైర్యం నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

Also Read  పనివాళ్లను మనవాళ్లు అనుకుంటే…ఇలానే ఉంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *