తిరుపతి మార్గంలో కొత్తరైళ్లు…వేసవి రద్దీకి నుంచి ఊరట

Summer special trains to Tirupati 2026

వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తపించే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే భారీ ఊరటనిచ్చింది. ఎండల తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, తిరుపతి సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ భారీ సంఖ్యలో సమ్మర్ స్పెషల్ రైళ్లను ప్రకటించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రయాణికుల సౌకర్యార్థం దాదాపు 32కు పైగా ప్రత్యేక సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

కోయంబత్తూర్ – జైపూర్ మధ్య 18 ప్రత్యేక రైళ్లు

ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ప్రయాణించే భక్తుల కోసం కోయంబత్తూర్ – జైపూర్ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

  • రైలు నం. 06181: ఏప్రిల్ 9 నుంచి జూన్ 4 వరకు ప్రతి గురువారం కోయంబత్తూర్ నుంచి బయల్దేరుతుంది. ఇది రేణిగుంట, కాచిగూడ మీదుగా జైపూర్ చేరుకుంటుంది.
  • రైలు నం. 06182: ఏప్రిల్ 12 నుంచి జూన్ 7 వరకు ప్రతి ఆదివారం జైపూర్ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, ఢోన్, కర్నూలు, మహబూబ్ నగర్, కాచిగూడ, నిజామాబాద్, బాసర వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. విశేషమేమిటంటే, ఈ రైలులో పూర్తిస్థాయిలో థర్డ్ ఏసీ బోగీలు మాత్రమే ఉంటాయి.

తిరుపతి – రక్సౌల్ మార్గంలో 14 సర్వీసులు

బీహార్ వైపు వెళ్లే భక్తుల కోసం తిరుపతి-రక్సౌల్ మార్గంలో 14 స్పెషల్ రైళ్లు సిద్ధమయ్యాయి.

  • రైలు నం. 07051: ప్రతి సోమవారం ఉదయం 8.15కి తిరుపతిలో బయల్దేరి బుధవారం సాయంత్రం రక్సౌల్ చేరుతుంది.
  • రైలు నం. 07052: తిరుగు ప్రయాణంలో ప్రతి గురువారం మధ్యాహ్నం రక్సౌల్ నుంచి బయల్దేరి శనివారం ఉదయం తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్, వికారాబాద్, కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ మీదుగా ప్రయాణిస్తుంది.

అకోలా, చర్లపల్లి, నరసాపూర్ వెళ్లే భక్తుల కోసం..

స్థానిక రద్దీని తగ్గించేందుకు తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు స్వల్పకాలిక ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి:

  • అకోలా: ఏప్రిల్ 10, 12 తేదీల్లో ప్రత్యేక రైళ్లు.
  • చర్లపల్లి (హైదరాబాద్): ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో తిరుపతి-చర్లపల్లి మధ్య స్పెషల్ ట్రైన్స్.
  • నరసాపూర్: ఏప్రిల్ 12, 13 తేదీల్లో గోదావరి జిల్లాల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు.
  • పండరీపూర్: ఏప్రిల్ 11, 12 తేదీల్లో విఠలనాథుని భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు.

ఎండలు ముదురుతున్న వేళ, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కష్టతరమవుతున్న తరుణంలో, రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య భక్తులకు కొండంత అండగా నిలిచింది. టిక్కెట్ల రిజర్వేషన్ ఇప్పటికే ప్రారంభమైంది కాబట్టి, వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లేవారు వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *