రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
✅తొలుత గ్రామంలో రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభ వేదికగా కంప్యూటర్‌పై బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈరోజు రూ. 2,200 కోట్ల నిధులను విడుదల చేయగా, ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ. 5,700 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.
✅ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఈ దేశానికి వెన్నెముక రైతులే. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు సంక్షేమమే మా విధానం” అని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.

✅“రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. గతసారి కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలన్నదే మా సంకల్పం. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా లక్ష్యం. అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం..” అని చెప్పారు.
✅ఈ రైతు ఉత్సవాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వివేక్ వెంకటస్వామి గారితో పాటు ప్రభుత్వ విప్‌లు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
✅అంతకు ముందు రూ. 203 కోట్లతో ఆరెంద – దామెరకుంట గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.