కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించాలని సంకల్పించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. మంత్రులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి #Medigadda బ్యారేజీ సైట్‌ను చేరుకున్న ముఖ్యమంత్రి గారు పునరుద్ధరణ చేపట్టడానికి సంబంధించి జరుగుతున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలను పరిశీలించారు.
✅నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ #NDSA తో పాటు ఇతర సంస్థల సూచనల ప్రకారం మేడిగడ్డను పునరుద్ధరించడానికి చేపట్టాల్సిన పనులపై జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.
✅మంత్రులు ఉత్తమ్ గారు, పొన్నం గారు, పొంగులేటి గారు, వివేక్ గారు, మినిస్టర్ అడ్లూరి, గారు, చైర్మన్ అనిల్ జైన్ గారితో పాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి గారు వెంట ఉన్నారు.
✅బ్యారేజీ కుంగిన ప్రాంతంలో పరిస్థితులను నీటి పారుదల శాఖ అధికారులు సమగ్రంగా వివరించారు. పునరుద్ధరణకు నిర్వహిస్తున్న వివిధ పరీక్షల విధానాలను తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పలు అంశాలపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
✅ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా #Geotechnical, #Geophysical, జీపీఆర్, శాంపిల్స్ సేకరణ పనులను పరిశీలించారు. పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో 520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్ (#CWPRS) కు పంపనున్నారు. అక్కడ ల్యాబ్‌లో పరీక్షల అనంతరం దెబ్బతిన్న బ్యారేజీకి సంబంధించి పూర్తి అవగాహన రానుంది.
✅డ్రోన్ బేస్డ్ GPR టెస్ట్‌కు సంబంధించి అధికారులు ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి అధికారులు వివరించారు. ఈ పరీక్షల ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావానికి సంబంధించి ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద సీలెంట్ పైల్స్‌కు సంబంధించి సమాంతర క్రాస్‌హోల్ సీస్మిక్ టెస్ట్ వివరాలను తెలిపారు.
✅ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి బ్యారేజీ వద్ద సాగుతున్న వివిధ పరీక్షలను పరిశీలించిన అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించి పలు సూచనలు చేశారు.

✅#KaleshwaramLiftIrrigationProject లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోపాలను సరిచేసి పునరుద్ధరించడంలో ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చిందని, పునరుద్ధరణలో భాగస్వామ్యమయ్యే సంస్థలు, అధికారులు, నిపుణులు సమస్యను అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్టేనని చెప్పారు.
✅ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్షల ద్వారా సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అధికారులు పనులు మొదలు పెట్టాలని చెప్పారు. సేకరించిన శాంపిల్స్ ద్వారా వచ్చే ఫలితాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు.
✅#NDSA మార్గదర్శకాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని, ప్రతి విషయంలో వారి అనుమతి తీసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ అధికారులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ప్రతినిధులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.